Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువకులు సరదాగా తాగే బీర్‌తో పొట్ట పెరుగుతుంది..

Webdunia
శుక్రవారం, 22 మార్చి 2019 (18:30 IST)
యువకులు సరదాగా తాగే బీర్ వలన ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో దుష్ప్రభావాలు కూడా ఇంకా ఎక్కువే ఉన్నాయి. తక్షణ సమస్యలే కాక దీర్ఘకాలిక సమస్యలు కూడా బీర్ వలన వస్తాయి. బీర్ తాగితే కొంత మేరకు మంచిదే అయినప్పటికీ ఎక్కువగా తీసుకోవడం వలన వచ్చే ఫలితాలు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అల్ప సమస్యల నుండి ప్రాణాంతక సమస్యల వరకూ కారణమవుతుంది. దీనిలో ఆల్కహాల్ ఉన్నందున శరీరంలో షుగర్ స్థాయిలు త్వరగా తగ్గి ఆకలి పెంచుతుంది. 
 
ఎక్కువగా తినడం వలన ఊబకాయానికి దారితీస్తుంది. పొట్ట పెరిగిపోతుంది. తరచుగా బీర్ తాగడం వలన మెదడు కణాలు దెబ్బతింటాయి. దాని వలన మీరు చేసే పనులపై దృష్టి కేంద్రీకరించలేరు. ఆల్కహాల్‌ని ఎక్కువగా తీసుకుంటే శరీర వ్యవస్థ డీహైడ్రేట్ అవుతుంది. ఉదయం లేవగానే చాలా తలనొప్పి, కడుపులో వికారం, నోరు ఎండిపోవడం వంటి చాలా లక్షణాలు కనిపిస్తాయి. 
 
అలసటకు గురవుతారు. హ్యాంగ్ ఓవర్ వస్తుంది కనుక బీర్‌కి దూరంగా ఉండటమే మంచిది. నిద్రాభంగం కూడా బీర్ వలన వస్తుంది. రాత్రిపూట తాగితే తరచూ బాత్ రూమ్‌కి వెళ్లవలసి వస్తుంది. స్ట్రెస్ హార్మోన్‌లను విడుదల చేస్తుంది. నిద్రకు దూరమవుతారు. 
 
హార్ట్ రేటు కూడా పెరిగి రక్త పోటు స్థాయి పెరుగుతుంది. ఆల్కహాల్ తాగడం వలన స్టమక్ యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అయి గుండె మంటకు కారణమవుతుంది. బీర్ తాగడం వలన లివర్ పాడయ్యే అవకాశాలు ఎక్కువ. కొన్ని బీర్లు లివర్‌కి మంచి చేసినప్పటికీ జాగ్రత్తలు పాటిస్తే మంచిది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments