Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పుచ్చకాయతో పుత్తడి బొమ్మగా మారొచ్చట..

పుచ్చకాయతో పుత్తడి బొమ్మగా మారొచ్చట..
, శుక్రవారం, 22 మార్చి 2019 (17:59 IST)
వేసవి రాగానే మనకు ముందుగా గుర్తొచ్చేది పుచ్చకాయ. ఏ పండ్లు తిన్నా తినకున్నా పుచ్చకాయ మాత్రం తప్పకుండా తింటాం. ఎర్రగా తియ్యగా ఉండే పుచ్చకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది. డీహైడ్రేషన్ సమస్యల నుండి తక్షణమే ఊరటనిస్తుంది. మానసిక ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మ సౌందర్యానికి, జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తుంది. 
 
పుచ్చకాయలో అత్యంత ముఖ్యమైన విటమిన్లు, పోషకాలు ఉన్నాయి. లైకోఫేన్ అనే ప్రత్యేకమైన పదార్ధం, మీ చర్మం నుంచి ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది. దీని వల్ల చర్మం పాడవకుండా ఉంటుంది. మీ రోజువారీ డైట్‌లో పుచ్చకాయను చేర్చుకోవడం వలన ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఫేస్ మాస్క్, క్లెన్సర్స్, హెయిర్ మాస్క్లు లేదా కండీషనర్ల రూపంలో మీ చర్మం మరియు జుట్టు సంరక్షణ ఏజెంట్లుగా ఉపయోగించుకోవచ్చు. 
 
విటమిన్ ఎ, బీ6, సిలు నిండుగా ఉండే పుచ్చకాయ నిజంగా ఒక దివ్య ఫలమనే చెప్పాలి. మీ చర్మాన్ని తేమగా, హైడ్రేట్‌గా ఉంచుతుంది. ఇది మీ చర్మంలో అదనపు నూనెల ఉత్పత్తిని నిరోధిస్తుంది. ఇది మీ పొడి చర్మానికి ఉత్తమమైన చికిత్స. ముడతలు లేని చర్మాన్ని అందిస్తుంది. చారలను అరికడుతుంది. మొటిమలు రాకుండా చూసుకుంటుంది. అందాన్ని పెంచుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోజుకు ఏడు గ్రాముల మునగాకు పొడిని తీసుకోవాల్సిందే..