Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్యారట్‌ జ్యూస్‌కు కొంచెం పుల్ల పెరుగు, తెల్లసొన చేర్చి?

క్యారట్‌ జ్యూస్‌కు కొంచెం పుల్ల పెరుగు, తెల్లసొన చేర్చి?
, మంగళవారం, 19 మార్చి 2019 (17:07 IST)
తియ్యని కూరగాయలలో క్యారట్ కూడా ఒకటి. క్యారట్‌లో ఉండే గుణాలు మరెందులోనూ లేవు. అవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సాధారణంగా క్యారట్‌తో చేసిన వంటకాలను కొంత మంది ఇష్టపడరు. అయితే చాలా మంది దీనిని పచ్చిగా తినేందుకు మొగ్గు చూపుతారు. ఇందులోని అధిక కేలరీలు పిల్లలను శారీరకంగా, మానసికంగా ఎదిగేలా చేయడమే కాక మేధో వికాసానికి తొడ్పడతాయి. 
 
క్యారట్‌లను వండితే నచ్చని వాళ్లు వీటిని సలాడ్లు, జ్యూస్‌ల రూపంలో తీసుకోవచ్చు. విటమిన్లు, ఖనిజాలు క్యారట్‌లో అధికంగా ఉంటాయి. తాజా క్యారట్‌లో మన శరీరానికి అత్యంత ఆవశ్యకమైన 12 ఖనిజ లవణాలు ఉంటాయి. క్యారట్ శరీరానికి విటమిన్ బి, సి లను అందించడమే కాకుండా అవసరమైన పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, సోడియం, మాంగనీస్, సిలికాన్, అయోడిన్‌లతో పాటు సల్ఫర్, భాస్వరం, క్లోరిన్ వంటి ఖనిజాలను సరఫరా చేస్తుంది. క్యారట్ పటిష్టమైన పళ్లకు, ఎముకలకు, చర్మ సౌందర్యానికి దోహదపడుతుంది. 
 
ఎండకు కమిలి రంగు కోల్పోయిన చర్మానికి తిరిగి కాంతినివ్వడంలో క్యారట్ సహాయపడుతుంది. ఎండ కారణంగా చనిపోయిన మృత కణాలను తిరిగి యాక్టివేట్ చేసి చర్మారోగ్యాన్ని ప్రసాదిస్తుంది. తాజా క్యారట్‌ జ్యూస్‌కు కొంచెం నీళ్ళు, పుల్ల పెరుగు, గుడ్డులో ఉండే తెల్లసొన కలిపి శిరోజాలకు పట్టించి కొద్దిసేపయ్యాక తలస్నానం చేస్తే జుట్టురాలడం తగ్గడమే కాక, శిరోజాలు గట్టిగా వుంటాయి. 
 
జుట్టు చివర్ల చిట్లిపోయినట్లు ఉంటే క్యారట్ ఆకులను మెత్తగా నూరి, నువ్వుల నూనే కలిపి తలకు రాసుకుని, పెసర పిండితో మర్దన చేస్తూ తలస్నానం చేస్తే, జుట్టు తెగకుండా నిగనిగలాడుతూ ఉంటుంది. క్యారట్ కళ్లకు కూడా మంచి చేస్తుంది. క్యారట్‌లో ఉండే విటమిన్ ఏ, బీ, ఇ తోపాటు పలు మినరల్స్ కళ్ళల్లో సాధారణంగా ఏర్పడే హ్రస్వ దృష్టి, దూరదృష్టి లోపాలను సరిదిద్దుతాయి. కంటి చూపు మెరుగుపడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భోజనాంతరం లవంగాన్ని నమిలితే..?