జ్ఞాపకానికి ‘మాట’ తోడు

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (08:42 IST)
మనిషికి మనిషి తోడు. వెంట ఎవరైనా ఉంటే మంచీ చెడూ మాట్లాడుకోవచ్చు. దీంతో మనసు తేలిక పడుతుంది. అంతేనా?.. మెదడు ఆరోగ్యమూ ఇనుమడిస్తుంది.

ఇటీవల వైద్యపత్రిక జామాలో ప్రచురితమైన అధ్యయనం ఇదే పేర్కొంటోంది. మనం చెప్పేది శ్రద్ధగా వినేవారుంటే విషయ గ్రహణ సామర్థ్యం (ఆలోచన, హేతుబద్ధత, జ్ఞాపకశక్తి) క్షీణించే అవకాశం తక్కువగా ఉంటున్నట్టు తేలింది మరి.

మెదడులో అల్జీమర్స్‌ మాదిరి మార్పులున్నా ‘మాట తోడు’ ప్రభావం కనిపిస్తుండటం గమనార్హం. ప్రస్తుతానికి అల్జీమర్స్‌ను నయం చేసే చికిత్స ఏదీ లేదు.

ఈ నేపథ్యంలో అల్జీమర్స్‌ లక్షణాలను నివారించుకోవటానికి, విషయ గ్రహణ సామర్థ్యం త్వరగా క్షీణించకుండా ఉండటానికి తగు జాగ్రత్తలు తీసుకునే అవకాశముందని తాజా అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి.
 
మనదేశంలో సుమారు 50 లక్షల మంది అల్జీమర్స్‌తో బాధపడుతున్నారని అంచనా. ఇది జ్ఞాపకశక్తి, భాష, నిర్ణయాలు తీసుకోవటం, స్వతంత్రంగా జీవించటాన్ని గణనీయంగా దెబ్బతీస్తుంది.

అల్జీమర్స్‌ ప్రధానంగా వృద్ధాప్యంలోనే దాడి చేస్తుంది కాబట్టి 65 ఏళ్ల కన్నా చిన్నగా ఉన్నవారు సామాజిక తోడ్పాటుతో గణనీయమైన ప్రయోజనాన్ని పొందే అవకాశముందని పరిశోధకులు చెబుతున్నారు.

40ల్లో, 50ల్లో ఉన్నప్పుడు మనం చెప్పేది శ్రద్ధగా వినేవారు ఎక్కువగా ఉన్నవారితో పోలిస్తే తక్కువగా ఉన్నవారిలో విషయ గ్రహణ సామర్థ్యం వయసు నాలుగేళ్లు అధికంగా ఉంటోందని వివరిస్తున్నారు.
 
ఈ నాలుగు సంవత్సరాలు చాలా కీలకం. ఎందుకంటే చాలామంది వయసు మీద పడ్డాకే మెదడు ఆరోగ్యాన్ని పెంచుకోవటం గురించి ఆలోచిస్తుంటారు. నిజానికి మెదడు ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడే అలవాట్లను అలవరచుకునే విలువైన సమయం అప్పటికే మించిపోతుంది.

ఇందుకోసం పెద్ద పెద్ద పనులేమీ చేయక్కర్లేదు. మంచి సామాజిక సంబంధాలు కలిగుండటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వంటి చిన్న చిన్న మార్పులైనా గణనీయమైన ప్రభావాన్ని చూపించగలవని పరిశోధకులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నిర్మలమ్మ పద్దు 140 కోట్ల మంది ఆకాంక్షలకు ప్రతిబింభం : ప్రధాని మోడీ

నిర్మలమ్మ ఆర్థిక పద్దు... ఆదాయ పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పు లేదు

కేంద్ర బడ్జెట్ 2026-27 : ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం 2025 అమలు

కేంద్ర బడ్జెట్ 2026-27 : దేశంలో 7 హై స్పీడ్ రైలు కారిడార్లు అభివృద్ధి

రికార్డు స్థాయిలో లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన విత్తమంత్రి నిర్మలమ్మ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగా ఫ్యామిలీకి వారసుడొచ్చాడు.. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారు : చిరంజీవి

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టారోచ్

ఫంకీ లో రట్టాటటావ్ గీతంలో విశ్వక్ సేన్, కయాదు లోహర్‌ కెమిస్ట్రీ వన్నెతెచ్చింది

NagAswin: నాగ్ అశ్విన్, సింగీతం శ్రీనివాసరావు, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ చిత్రం షురూ

'జన నాయగన్' నిర్మాతకు తీవ్ర నష్టం జరుగుతోంది : హీరో విజయ్

తర్వాతి కథనం
Show comments