Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

సిహెచ్
శనివారం, 28 జూన్ 2025 (19:00 IST)
గుండె జబ్బులు, అధిక రక్తపోటు వంటి జీవనశైలి వ్యాధులను నివారించడానికి కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం అత్యంత కీలకం. కొలెస్ట్రాల్‌ను సమర్థవంతంగా నిర్వహించడానికి, సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. బాదం, ఓట్స్, తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు వంటి ఆహారాలను డైట్‌లో చేర్చుకోవడం కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడం వీలవుతుంది. ఆహారంతో పాటు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా చాలా అవసరం. ఈ వ్యాసంలో, మీ రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాల్సిన, ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడంలో సహాయపడే ఆహారాలు ఏమిటో తెలుసుకుందాము. 
 
బాదం: పోషకాల గని బాదం. ఇందులో ప్రోటీన్, మెగ్నీషియం, కాల్షియం, జింక్ వంటి 15 ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. మీ ఆహారంలో బాదంను చేర్చుకోవడం వల్ల గుండెకు హాని కలిగించే వాపు తగ్గించటంతో పాటుగా LDL కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. కొన్ని బాదంలను అల్పాహారంగా తీసుకోవడం వల్ల HDL కొలెస్ట్రాల్‌ స్థాయి మెరుగుపడుతుంది. నడుం దగ్గర కొవ్వును, నడుము చుట్టుకొలతను తగ్గిస్తుంది. కొవ్వు అనేది గుండె జబ్బులకు ప్రమాద కారకం. సలాడ్‌లు, డెజర్ట్‌లు లేదా స్మూతీలలో బాదంను జోడించడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.
 
తృణధాన్యాలు- ఓట్స్: మీ ఆహారంలో తృణధాన్యాలను చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. వాటిలో మెరుగైన రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడం, బరువు నిర్వహణ, LDL కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించే లక్షణాలు ఉన్నాయి. ముఖ్యంగా కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఓట్స్  ప్రభావవంతంగా పనిచేస్తాయి. మీరు తీసుకునే ఆహరంలో తృణధాన్యాలు, ఓట్స్‌ను చేర్చడానికి, అల్పాహారంలో ఓట్ మీల్ లేదా తృణధాన్యాలను ఎంచుకోండి, బేకింగ్‌లో తృణధాన్యాల పిండిని ఉపయోగించండి, సలాడ్‌లు లేదా సూప్‌లలో వండిన తృణధాన్యాలను జోడించండి, ఓట్స్‌ను స్మూతీలలో కలపండి, శాండ్‌విచ్‌ల కోసం తృణధాన్యాల బ్రెడ్‌ను ఎంచుకోండి.
 
పండ్లు: పండ్లు అధికంగా ఉండే డైట్‌లో ఫైబర్ కంటెంట్, అధిక నీటి స్థాయిలు, తక్కువ సంతృప్త కొవ్వు కారణంగా లిపిడ్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ కారకాలు కొలెస్ట్రాల్‌ను తగ్గించడమే కాకుండా ఆకలిని నియంత్రించడం, బరువు నిర్వహణలో సహాయపడతాయి. మీ ఆహారంలో పండ్లను సౌకర్యవంతంగా చేర్చడానికి, వాటిని స్మూతీలలో కలపండి, తృణధాన్యాలు, పెరుగు లేదా సలాడ్‌లలో జోడించండి, వాటిని ఆరోగ్యకరమైన స్నాక్స్‌గా ఆస్వాదించండి, పండ్లతో నింపిన నీరు లేదా ఫ్రోజెన్ ట్రీట్‌లను తీసుకోండి. పోషకాలను పెంచుకోవడానికి బేకింగ్, రుచికరమైన వంటకాలలో చేర్చండి.
 
వెల్లుల్లి: మీ ఆహారంలో వెల్లుల్లిని క్రమం తప్పకుండా జోడించడం వల్ల LDL కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. వంటలో వెల్లుల్లిని చేర్చుకోవడం, స్ప్రెడ్‌ల కోసం వేయించడం, కూరగాయలతో కలిపి తీసుకోవడం లేదా సలాడ్‌లు, డిప్‌లు- కూరలలో చేర్చడం ద్వారా మీ భోజనాన్ని సంపూర్ణం చేసుకోండి. అదనపు రుచి కోసం, వెల్లుల్లి పొడిని చల్లుకోండి లేదా పప్పులు వంటి సాంప్రదాయ వంటకాలలో కలపండి.
 
ఆరోగ్యకరమైన ఆహారాన్ని స్వీకరించడంతో పాటు, క్రమం తప్పకుండా వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వడం గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కీలకం. ఈ ఆహార మార్పులను స్వీకరించండి, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి, ఆరోగ్యం మెరుగుపరుచుకోవటానికి చురుకుగా ఉండటానికి కట్టుబడి ఉండండి.
 
-న్యూఢిల్లీలోని మాక్స్ హెల్త్‌కేర్‌లో డైటెటిక్స్ రీజినల్ హెడ్- రితికా సమద్దర్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మహా న్యూస్ చానెల్‌‍పై దాడిని తీవ్రంగా ఖండించిన పవన్ కళ్యాణ్

కాంగ్రెస్ నేతలంటే అపార గౌరవం... సీరియస్‌గా తీసుకోవద్దు : కొండా మురళి

భర్తకి 12 మంది స్త్రీలతో వివాహేతర సంబంధం, భార్యను 8 సార్లు కత్తితో పొడిచాడు

ఐఫోన్‌లో షూట్ చేస్తే రీల్స్ ఎక్కువగా వస్తాయనీ.. యువకుడి గొంతు కోశారు..

లాక్కెళ్లి గదిలో బంధిస్తే.. పారిపోయేందుకు యత్నించగా హాకీ స్టిక్‌తో తలపై కొట్టారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

తర్వాతి కథనం
Show comments