Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Advertiesment
Yoga-Almonds

సిహెచ్

, గురువారం, 19 జూన్ 2025 (19:57 IST)
ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకునే అంతర్జాతీయ యోగా దినోత్సవం, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సును పెంపొందించడంలో యోగా యొక్క సమగ్ర ప్రయోజనాలను వేడుక జరుపుకుంటుంది. యోగా సాధన అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుండగా, సరైన ఫలితాల కోసం సమతుల్య ఆహారం తీసుకోవటం కూడా అంతే అవసరం. ఆరోగ్యకరమైన ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు వంటి వివిధ రకాల పోషకాలు ఉండాలి. బాదం అనుకూలమైన , పోషకమైన ఎంపికగా నిలుస్తుంది. మీరు దీర్ఘ ఆసనాలు వేస్తుంటే, తగినంత ప్రోటీన్ తీసుకోవడం అవసరం. ఇది యోగాసనాల తర్వాత కండరాల కోలుకోవడానికి మద్దతు ఇస్తుంది. 
 
గింజలలో రాజు అయిన బాదంలో 15 ముఖ్యమైన పోషకాలు వున్నాయి. డాక్టర్ మార్క్ కెర్న్ ఇటీవల ప్రచురించిన అధ్యయనం ప్రకారం, క్రమంతప్పకుండా బాదం తినడం, వ్యాయామం తర్వాత వేగంగా కోలుకోవడానికి సహాయపడుతుంది. డాక్టర్ ఆలివర్ విటార్డ్ చేసిన మరో అధ్యయనం బాదంను వ్యాయామం చేయడానికి ముందు ప్రభావవంతమైన చిరుతిండిగా వెల్లడించింది, ఇది కండరాల నొప్పిని తగ్గించడానికి, కండరాల పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. బాదంను రోజువారీ ఆహారంలో చేర్చడం వల్ల LDL (చెడు) కొలెస్ట్రాల్‌ను తగ్గించడం, రక్తంలో చక్కెర నియంత్రణకు మద్దతు ఇవ్వడం, ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందడం, ప్రభావవంతమైన బరువు నిర్వహణలో సహాయపడటం వంటి వివిధ ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
 
ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్ మాట్లాడుతూ, “యోగా, పనిపై దృష్టి కేంద్రీకరించడానికి సహాయపడటమే కాకుండా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా తెచ్చిపెట్టింది. నా యోగాభ్యాసాన్ని సంపూర్ణం చేసుకోవటానికి, నేను కాలానుగుణ పండ్లు, కూరగాయలు, పెరుగు, బాదంపప్పులతో నిండిన సమతుల్య ఆహారాన్ని తీసుకుంటాను. ముఖ్యంగా బాదంపప్పులు ఎల్లప్పుడూ నాకు ఇష్టమైన చిరుతిండి. ప్రోటీన్, కొన్ని ముఖ్యమైన పోషకాలతో నిండిన ఇవి నా మొత్తం ఆరోగ్యంకు మద్దతు ఇస్తాయి” అని అన్నారు. 
 
న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ, “ఉత్తమ ఫలితాల కోసం యోగా వంటి శారీరక శ్రమను సమతుల్య ఆహారంతో జత చేయాలని నేను ఎల్లప్పుడూ సిఫార్సు చేస్తుంటాను. ఇందులో బాదం, ఇతర ప్రోటీన్-రిచ్ ఫుడ్స్ చేర్చడం కూడా ఉంటుంది. వాటి ప్రోటీన్, డైటరీ ఫైబర్, గుండెకు ఆరోగ్యకరమైన కొవ్వులతో, బాదం బరువు నిర్వహణ, ఇతర పోషక అవసరాలకు మద్దతు ఇస్తుంది” అని అన్నారు. 
 
మాక్స్ హెల్త్‌కేర్-న్యూఢిల్లీలో డైటెటిక్స్ ప్రాంతీయ అధిపతి రితికా సమద్దర్ మాట్లాడుతూ, "యోగా అనేది శారీరక, మానసిక శ్రేయస్సుకు మద్దతు ఇచ్చే శక్తివంతమైన అభ్యాసం. ఆరోగ్యకరమైన, సమతుల్య జీవనశైలిని నిర్వహించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. యోగా యొక్క ప్రయోజనాలను మెరుగ్గా పొందటానికి పోషకమైన ఆహారంతో దానిని పూర్తి చేయాలని సిఫార్సు చేస్తున్నాను. మీ దినచర్యలో బాదం వంటి ఆహారాలను చేర్చుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. బాదం ప్రోటీన్ యొక్క సహజ మూలం, ఇది శారీరక శ్రమ తర్వాత కండరాల కోలుకోవడానికి సహాయపడుతుంది" అని అన్నారు.
 
ఫిట్‌నెస్, సెలబ్రిటీ బోధకురాలు యాస్మిన్ కరాచీవాలా మాట్లాడుతూ, “వ్యాయామాలు నన్ను శారీరకంగా ఆరోగ్యంగా ఉంచుతుండగా, యోగా నన్ను ప్రశాంతంగా, కేంద్రీకృతంగా ఉంచడానికి సహాయపడుతుంది. సహజమైన, ఆరోగ్యకరమైన ఆహారాలు అధికంగా ఉండే ఆహారం అంటే బాదం వంటివి ఎక్కువగా తీసుకుంటాను. అవి ప్రోటీన్, ఫైబర్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటాయి, ఇవి నా రోజువారీ పోషకాహారానికి విలువైన జోడింపుగా ఉంటాయి..” అని అన్నారు. 
 
ప్రముఖ దక్షిణ భారత నటి శ్రియ శరణ్ మాట్లాడుతూ, “యోగా ఎప్పుడూ వ్యాయామం కంటే ఎక్కువే. ఇది నా శరీరం, మనస్సు రెండింటితోనూ కనెక్ట్ అవ్వడానికి ఒక మార్గం. నా అభ్యాసానికి మద్దతుగా, నేను బాదం వంటి ఆహారాలపై దృష్టి పెడుతుంటాను. నేను సాధారణంగా యోగా తర్వాత బాదంను ఆస్వాదిస్తాను. ఇది నిజంగా తేడాను కలిగిస్తుంది” అని అన్నారు. ఆయుర్వేద నిపుణురాలు మధుమిత కృష్ణన్ మాట్లాడుతూ, “యోగా సాధన శరీరం, మనస్సును అనుసంధానించడంతో పాటుగా సమగ్ర శ్రేయస్సును ప్రోత్సహిస్తుంది. బాదం వంటి పోషకమైన ఆహారాలతో కలిపినప్పుడు, ఇది మొత్తం ఆరోగ్యం పెంపొందించటానికి తోడ్పడుతుంది. రోజువారీ భోజనంలో ఇవి చేర్చడం సులభం" అని అన్నారు. 
 
ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, బుద్ధిపూర్వక కదలిక, శరీర పోషణ మధ్య సమతుల్యతను గౌరవించండి. సమర్థవంతమైన బరువు నిర్వహణకు, సంపూర్ణ ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడానికి పోషకాలు అధికంగా ఉండే బాదంపప్పులను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?