Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రధాని మోదీ వల్లే ప్రపంచ వ్యాప్తంగా యోగాకు గుర్తింపు.. చంద్రబాబు కితాబు

Advertiesment
chandrababu naidu

సెల్వి

, బుధవారం, 21 మే 2025 (14:06 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ వ్యాప్తంగా యోగాకు గుర్తింపు తెచ్చారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు. యోగా భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన బహుమతి అని ఆయన అభివర్ణించారు. అన్ని దేశాలు యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు.
 
యోగా కొంతమంది వ్యక్తులకు లేదా కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాదన్నారు. నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగే యోగా ఉద్యమం 'యోగాంధ్ర 2025'ను ప్రారంభించిన తర్వాత ముఖ్యమంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. జూన్ 21న విశాఖపట్నంలో జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలతో ఈ ప్రచారం ముగుస్తుంది. దీనిలో ప్రధాని మోదీ పాల్గొంటారు.
 
'యోగాంధ్ర' వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించిన ముఖ్యమంత్రి నాయుడు, యోగాను ప్రతి ఒక్కరి జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఒత్తిడిని అధిగమించడానికి ప్రజలు యోగాను అభ్యసించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 
 
యోగా అనేది ఒక కార్యక్రమం లేదా ఫోటోల కోసం ఒక రోజు కార్యక్రమం కాదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. "ఇది ప్రతి ఒక్కరిలో అద్భుతమైన మార్పును తీసుకువచ్చే కార్యక్రమం. యోగా మన జీవనశైలిలో భాగం అయ్యేలా ముందుకు తీసుకెళ్లాలి" అని చంద్రబాబు అన్నారు.
 
'యోగాంధ్ర'లో కనీసం రెండు కోట్ల మంది పాల్గొనాలని ముఖ్యమంత్రి నాయుడు అన్నారు. 10 లక్షల మందికి సర్టిఫికెట్లు ఇవ్వడమే లక్ష్యమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో రోజుకు ఒక గంట యోగా సెషన్ ఉంటుందని ఆయన ప్రకటించారు.
 
 జూన్ 21న విశాఖపట్నంలో ఆర్కే బీచ్ నుండి భోగాపురం వరకు జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో 5 లక్షల మంది పాల్గొంటారని ముఖ్యమంత్రి చెప్పారు.
 
అంతకుముందు, విశాఖపట్నంలో జరిగే యోగా సెషన్‌లో దాదాపు 2.5 లక్షల మంది పాల్గొనడంతో ఒకే చోట జరిగే యోగా సెషన్‌కు అతిపెద్ద సమావేశంగా కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సృష్టించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు.
 
2023లో, సూరత్ ఒకే చోట 1.53 లక్షల మంది పాల్గొనే యోగా సెషన్‌ను నిర్వహించి, కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సృష్టించింది. విశాఖపట్నంలో జరిగే ఈ కార్యక్రమంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఆ రికార్డును అధిగమించాలని యోచిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 28 మంది మృతి