Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బైటకు రావద్దు తలాహ్ సయీద్, నిన్నూ లేపేయొచ్చు: పాక్ ఆర్మీ, ఐఎస్ఐ వార్నింగ్

Advertiesment
Terrorist

ఐవీఆర్

, సోమవారం, 19 మే 2025 (21:20 IST)
మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో లష్కరే తోయిబాకు చెందిన సైఫుల్లాను గుర్తు తెలియని సాయుధుడొకరు పాకిస్తాన్ దేశంలోని సింధ్ ప్రావిన్సిలో రోడ్డుపైన కాల్చి చంపాడు. ఈ నేపధ్యంలో పాకిస్తాన్ ఆర్మీ మిగిలిన కరడుగట్టిన ఉగ్రవాదులకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా 26/11 దాడుల సూత్రధారుడైన తలాహ్ సయీద్ నెక్ట్స్ టార్గెట్ అని సమాచారం అందినట్లు ఐఎస్ఐ పాకిస్తాన్ ఆర్మీని అలెర్ట్ చేసిందట. దీనితో ఇప్పుడు పాకిస్తాన్ దేశం లోపల వున్న ఉగ్రవాదులను పాక్ ఆర్మీ అలెర్ట్ చేసినట్లు తెలుస్తోంది. తమకు సమాచారం లేకుండా ఎట్టి పరిస్థితుల్లో అడుగు బైట పెట్టవద్దని సూచన చేసింది. అంతేకాదు.. మరీ అవసరమైతే తప్ప బైటకు రావద్దని చెప్పారట. 
 
తలాహ్ సయీద్... అప్రమత్తంగా లేకపోతే లేపేయడం ఖాయం?!!
26/11 ముంబై ఉగ్రదాడి సూత్రధారి తలాహ్ సయీద్, మోస్ట్ వాంటెడ్ హఫీజ్ సయీద్ కుమారుడు. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ వేసే రాక్షస ప్రణాళికలన్నీ ఇతడి మెదడు నుంచి బైటకు వస్తుంటాయని సమాచారం. అందువల్ల అతడిని ఎలాగైనా పట్టుకోవాలని గత కొన్నేళ్లుగా భారత్ అదను కోసం చూస్తోంది.
 
పహెల్గాం ఉగ్రదాడి అనంతరం భారత దేశ వ్యాప్తంగా ఉగ్రవాదులకు వెన్నుదన్నుగా వుంటున్న పాకిస్తాన్ దేశానికి బుద్ధి చెప్పాలని ముక్తకంఠంతో చెప్పారు. దీనితో భారతదేశం ఆర్మీ... పాక్ భూభాగంలో నివాసం వుంటున్న ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో ఉగ్రవాదులు మృతి చెందారు. ఇక ఇప్పుడు ఉగ్రవాదుల్లో మిగిలి వున్న టాప్ లీడర్ల లక్ష్యంగా వేట సాగుతున్నట్లు సైఫుల్లా హతంతో పాకిస్తాన్ భయపడుతోంది. తమ చేతుల్లో వున్న ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకుండా చూసుకునేందుకు ప్రయత్నిస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

China: సింధు జలాల నిలిపివేత.. పాకిస్థాన్‌లో ఆ పనులను మొదలెట్టిన చైనా.. ఏంటది?