Webdunia - Bharat's app for daily news and videos

Install App

డెంగ్యూ జ్వరం నుంచి త్వరగా కోలుకునేందుకు చిట్కాలు

Webdunia
మంగళవారం, 9 ఆగస్టు 2022 (16:48 IST)
వర్షాకాలం రాగానే దోమల బెడద మొదలవుతుంది. దీనితో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలుతాయి. డెంగ్యూ జ్వరం వల్ల శరీరంలో ప్లేట్‌లెట్ కౌంట్ వేగంగా తగ్గిపోతుంది. ఇది అంతర్గత రక్తస్రావంతో సహా అనేక తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. బొప్పాయి ఆకులు ఈ వ్యాధిని ఎదుర్కోవడానికి సహాయపడతాయి. బొప్పాయి ఆకుల నుండి రసాలను తీసుకోవడం వల్ల ప్లేట్‌లెట్ కౌంట్‌ తగ్గకుండా మెయింటైన్ చేయడంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచవచ్చు. బొప్పాయి ఆకులకు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా ఉన్నాయి.

 
అదేవిధంగా ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచడానికి వేప ఆకులు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. శరీరంలోని ఇన్ఫెక్షన్‌ను ఎదుర్కోవడంలో తెల్ల రక్త కణాలను పెంచడానికి కూడా ఇవి సహాయపడతాయి. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ల్పమేటరీ లక్షణాలు ఉన్నాయి. మెంతి గింజలు బహుళ పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరం త్వరగా కోలుకోవడానికి సహాయపడుతాయి. అధిక శరీర ఉష్ణోగ్రతను అదుపుచేయడంతో పాటు కండరాల నొప్పిని తగ్గించడంలో కూడా ఇవి చాలా సాయపడతాయి. ఇవి శరీరానికి విశ్రాంతిని కలిగించి అవసరమైన నిద్రను పొందడంలో సహాయపడుతాయి. దీనితో శరీరం మెరుగ్గా నయమవుతుంది.

 
పసుపు యాంటీమైక్రోబయల్, యాంటిసెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఇది చాలా సహాయకారిగా ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థకు భారీ ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇది జీవక్రియను కూడా పెంచుతుంది. తులసి ఆకులు ఒక అద్భుత ఔషధంగా పనిచేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడానికి తులసి, నల్ల మిరియాలు కలిపి తీసుకోవడం మంచిదని నిపుణులు చెపుతారు. ఈ రెండింటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే తులసి, ఎండుమిర్చిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

 
దోమల నివారణ గుణాలు కలిగిన మొక్కలను పెంచడం ద్వారా వాటిని అడ్డుకోవచ్చు. కొన్ని మొక్కలు దోమలను తరిమికొట్టే సహజ గుణం కలిగి ఉంటాయి. ఈ మొక్కల సారాలను తరచుగా దోమలను తిప్పికొట్టే క్రీములలో కూడా చూడవచ్చు. అలాంటి మొక్కలను ఇంట్లో పెంచి సంరక్షించుకోవచ్చు. ఇది అందంగా కనిపించడమే కాకుండా, దోమలను అతి తక్కువ శ్రమతో, సహజమైన రీతిలో దూరంగా ఉంచడంలో సహాయపడుతాయి. లెమన్ గ్రాస్, తులసి వంటి కొన్ని మొక్కలు ఉన్నాయి. అలాగే వేప, యూకలిప్టస్ వంటి కొన్ని పెద్ద మొక్కలతో కూడా దోమలను నిరోధించవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీలో కొత్త టెక్స్‌టైల్ పాలసీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు

అది యేడాది క్రితం పోస్టు.. ఈ కేసులో అంత తొందరెందుకో : ఆర్జీవీ ప్రశ్న

16 యేళ్లలోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాల్సిందే...

ఢిల్లీలో పవన్ కళ్యాణ్ 'తుఫాన్' - నేడు ప్రధాని మోడీతో భేటీ!!

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

ఎట్టకేలకు ఓ ఇంటివాడైన నటుడు పెనుమత్స సుబ్బరాజు!

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

తర్వాతి కథనం
Show comments