తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

సిహెచ్
శుక్రవారం, 6 జూన్ 2025 (21:24 IST)
చక్కెర తీపిగా ఉంటుంది, కానీ దానిలో ఎక్కువ భాగం ఆరోగ్యాన్ని చెడగొడుతుంది. పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, ధాన్యాలు వంటి మొత్తం ఆహారాలలో సహజ చక్కెరలు ఉంటాయి. శరీరం ఆ కార్బోహైడ్రేట్లను నెమ్మదిగా జీర్ణం చేస్తుంది. తద్వారా మీ కణాలకు స్థిరమైన శక్తి లభిస్తుంది. కానీ ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ వంటి అదనపు చక్కెరలు ప్యాక్ చేసిన ఆహారాలు శరీరానికి చేటు చేస్తాయి. వాటివల్ల కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసుకుందాము.
 
అధిక చక్కెర-తీపి పానీయాలు తీసుకుంటే అధిక బరువు పెరగడంతో మధుమేహం, కొన్ని క్యాన్సర్లు వంటి సమస్యలు వస్తాయి.
అదనపు చక్కెర రక్తప్రవాహంలోకి ఎక్కువ కొవ్వులను విడుదల చేస్తుంది. రెండూ గుండెపోటు, స్ట్రోక్, ఇతర గుండె జబ్బులకు దారితీయవచ్చు.
ముఖ్యంగా చక్కెర పానీయాలు తరచూ తీసుకునేవారిలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలను పెంచుతాయి.
చక్కెర రక్తపోటును పెంచుతుందని, ఇన్సులిన్ స్థాయిలను చాలా ఎక్కువగా పెంచుతుందని చెప్పబడింది.
అధిక చక్కెరలతో చెడు (LDL) కొలెస్ట్రాల్ పెరుగుతుంది, అదేసమయంలో మంచికొవ్వు (HDL) తగ్గిపోతుంది.
ప్యాక్ చేసిన ఆహారాలు, స్నాక్స్, పానీయాలు ఫ్రక్టోజ్‌తో తియ్యగా ఉంటాయి, వీటివల్ల కాలేయానికి సమస్య తలెత్తుతుంది.
చక్కెర పానీయాలు, ఎండిన పండ్లు, మిఠాయి, చాక్లెట్ వంవి తినేవారిలో దంతాలు పాడైపోతాయి.
పగటిపూట ఎక్కువ చక్కెర రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను దెబ్బతీసి, రాత్రివేళ నిద్రపోవడానికి ఇబ్బందిని కలిగిస్తుంది.
అధిక చక్కెరతో ఫ్రక్టోజ్ పెరిగి ఇది రక్తంలో యూరిక్ ఆమ్లాన్ని పేరుకుపోయేలా చేసి, ఇది బొటనవేలు, మోకాలు, ఇతర కీళ్లలో గట్టి స్ఫటికాలను ఏర్పరుస్తుంది.
టేబుల్ షుగర్, అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ లేదా ప్రాసెస్ చేసిన ఆహారాల నుండి వచ్చే అధిక ఫ్రక్టోజ్ మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలను పెంచుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Google‌కి బాబు ఇచ్చిన ప్రోత్సహకాలు చూసి గుడ్లు తేలేస్తున్న కర్నాటక ఐటి మినిస్టర్ (Video)

మంత్రి నారాయణగారు నన్నేమన్నారో చూపించండి: వర్మ సూటి ప్రశ్న (video)

కొండా సురేఖ ఇంట్లో అర్థరాత్రి హైడ్రామా.. మా అమ్మ ఇంటికొచ్చి కన్నీళ్లు పెట్టుకునేది? (video)

ఏపీ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కారు : ప్రధాని నరేంద్ర మోడీ

కర్ణాటక మంత్రులు వర్సెస్ నారా లోకేష్‌ల స్పైసీ వార్... రాయితీలిస్తే ఏపీకి పెట్టుబడులు రావా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

తర్వాతి కథనం
Show comments