పైల్స్ లేదా మొలలు. ఈ సమస్య పలు కారణాల వల్ల వస్తుంది. మలబద్ధకం, ఫైబర్ లేని పదార్థాలు తినడం, ఎక్కువసేపు కూర్చుని పని చేయడం, అధికంగా బరువులు ఎత్తడం, అసహజ రీతిలో శృంగారం, జన్యు సంబంధ సమస్యలతో పాటు ఎక్కువసేపు టాయిలెట్ ఆపుకోవడం వంటివాటివల్ల పైల్స్ సమస్య వస్తుంది. ఈ సమస్య నుంచి ఎలా బైటపడాలో తెలుసుకుందాము.
రాత్రిపూట పడుకునే ముందు పసుపు వేసిన పాలను తాగితే ఉపశమనం కలుగుతుంది.
మలబద్ధకం కలుగకుండా వుండేందుకు ఓ స్పూన్ నెయ్యిని ఆహారంలో కలుపుకుని తినాలి.
టీ ట్రీ ఆయిల్, కొబ్బరినూనె కలిపి రాత్రిపూట పడుకునే ముందు పైల్స్ వున్నచోట రాస్తే ఉపశమనం కలుగుతుంది.
గ్లాసుడు గోరువెచ్చని నీటిలో కాస్త తేనె వేసి రాత్రివేళ నిద్రపోయే ముందు తాగాలి.
కలబంద రసాన్ని రోజూ ఉదయం పరగడుపున 30 ఎంఎల్ సేవిస్తుంటే సమస్య తగ్గుతుంది.
తృణధాన్యాలు, పప్పులు, తాజాపండ్లు, కూరగాయలు ఆహారంలో భాగం చేసుకుంటే పైల్స్ సమస్య తగ్గుతుంది.
మంచినీరు అధికంగా తాగుతూ వుంటే జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా వుండి పైల్స్ సమస్య వెనకాడుతుంది.
గంటల తరబడి కుర్చీలో కూర్చుని పనిచేసేవారు మధ్యమధ్యలో విరామం తీసుకుని అటుఇటూ నడవాలి.