Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉసిరి పొడిని అలా తీసుకుంటే కలిగే ఫలితం ఏంటో తెలుసా? (video)

Webdunia
బుధవారం, 25 సెప్టెంబరు 2019 (22:39 IST)
వర్షా కాలం వచ్చేసింది. దీనితోపాటు పలు అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు వుంటుంటాయి. సహజంగా రుతువులు మారినప్పుడు ఆరోగ్యపరంగా సమస్యలు తలెత్తుతుంటాయి. ఈ సమస్యలు తలెత్తేవరకూ వుండకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవాలి.

ఇంట్లో వారందరికీ రోగనిరోధక శక్తి ఉసిరి ఇవ్వండి. ఉసిరిపొడిని పెద్దలు ఒక స్పూన్, పిల్లలు అరస్పూన్ తీసుకోవాలి. అన్నంలో తొలిముద్ద ఉసిరికాయ పచ్చడితో తినండి. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరిచే సి విటమిన్‌ను బాగా అందిస్తుంది. 
 
ఆహారంలో అల్లం, వెల్లుల్లి భాగం చేసి క్రమం తప్పక తీసుకోండి. ఇవి యాంటీవైరస్, యాంటీ బ్యాక్టీరియల్ శక్తి కలిగినవి. వేప ఆకులను వేసి ఉంచిన నీటితో స్నానం చేయడం, ఇంట్లో కర్పూరం వెలిగించడం ఆరోగ్యకరం. తులసి ఆకుల రసం తీసి త్రాగితే రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. 
 
యూకలిప్టస్ ఆయిల్ ఆవిరి పీలిస్తే ముక్కులో చేరిన వైరస్‌లు తొలగిపోతాయి. పసుపు చల్లి ఉడికించిన వంటకాలు, నల్ల మిరియాలు వాడిన వంటకాలు తినటం వల్ల రోగాలు దరిచేరవని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
 

సంబంధిత వార్తలు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాలను పక్కనబెట్టేయాల్సిందే.. సీఎం జగన్

కవిత బెయిల్ పిటిషన్- తీర్పును రిజర్వ్ చేసిన అవెన్యూ కోర్టు

తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ప్రథమ స్థానంలో ములుగు

కేసీఆర్‌కు తప్పిన ప్రమాదం.. వేములపల్లి వద్ద వాహనాల ఢీ

భర్తను అన్నయ్య హత్య చేశాడు.. భార్య ఆత్మహత్య చేసుకుంది.. కారణం?

గుంటూరు కారం మెట్టు దిగింది.. 'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో అజిత్‌తో శ్రీలీల

నా సినిమాల గురించి నికోలయ్ నిర్మొహమాటంగా చెబుతారు : శబరి నటి వరలక్ష్మీ శరత్ కుమార్

ఆశిష్, వైష్ణవి చైతన్య, దిల్‌రాజు ప్రొడక్షన్స్ లవ్ మీ- ఇఫ్ యు డేర్

కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుంది

పృథ్వీ హీరోగా, రూపాలి, అంబిక హీరోయిన్లుగా చిత్రం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments