Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిపా వరల్డ్ కప్ : కన్నీటిపర్యంతమైన మొరాకో ఆటగాళ్లు.. ఎందుకు?

సెయింట్‌పీటర్స్‌బర్గ్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌ అనంతరం మొరాకో ఆటగాళ్ళు మైదానంలోనే కన్నీటిపర్యంతమయ్యారు. ఆయాచిత గోల్‌తో ఇరాన్ గెలుపును సొంతం చేసుకోవడంతో మొరాకో ఆటగాళ్లు ఘొల్లుంటూ ఏడ్చేశారు. ఆ మ్

Webdunia
శనివారం, 16 జూన్ 2018 (09:34 IST)
సెయింట్‌పీటర్స్‌బర్గ్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌ అనంతరం మొరాకో ఆటగాళ్ళు మైదానంలోనే కన్నీటిపర్యంతమయ్యారు. ఆయాచిత గోల్‌తో ఇరాన్ గెలుపును సొంతం చేసుకోవడంతో మొరాకో ఆటగాళ్లు ఘొల్లుంటూ ఏడ్చేశారు. ఆ మ్యాచ్ వివరాలను పరిశీలిస్తే...
 
ఇరాన్ ‌- మొరాకో మధ్య జరిగిన గ్రూప్‌-బి తొలి మ్యాచ్‌ శుక్రవారం జరిగింది. ఈ మ్యాచ్ ఫలితం సంచలన రీతిలో వెలువడింది. మ్యాచ్ మరికొన్ని క్షణాల్లో డ్రాగా ముగుస్తుందని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ, అంతలోనే ఏదో మాయ జరిగిపోయింది. 
 
వాస్తవానికి మ్యాచ్‌ నిర్ణీత సమయం అయిపోయినా.. 6 నిమిషాల అదనపు సమయం పాటు మ్యాచ్ కొనసాగుతోంది. అదికూడా ముగిసే సమయంలోనే ఇరాన్‌ మిడ్‌ఫీల్డర్‌ ఎహ్‌సాన్‌ హజీ సఫీ కొట్టిన ఫ్రీకిక్‌.. మొరాకో గోల్‌పోస్ట్‌ నుంచి పక్కగా వెళ్లగా దానిని మొరాకో సబ్‌స్టిట్యూట్‌ అజీజ్‌ బౌహాతౌజ్‌ తలతో అడ్డుకున్నాడు. 
 
అయితే ఆ బంతికాస్త దిశ మార్చుకొని మొరాకో గోల్‌పోస్ట్‌లోకి వెళ్లడంతో ఆయాచిత గోల్‌తో లభించింది. దీంతో ఇరాన్‌ విజయాన్ని అందుకోగా, ఆ జట్టు ఆటగాళ్ల సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. మరోవైపు అనుకోని ఈ ఉదంతంతో మొరాకో కన్నీటిపర్యంతమైంది. 

సంబంధిత వార్తలు

ట్రోల్స్ ధాటికి టెక్కీ ఆత్మహత్య.. ఏమైంది.. ఎక్కడ?

గుజరాత్‌లో నవ వధువును కిడ్నాప్ చేసిన సాయుధ దుండగులు!!

మహిళ కడుపులో 570 రాళ్లు: షాక్ అయిన డాక్టర్లు

తప్పు చేయనపుడు భయపడొద్దు.. స్వదేశానికి వచ్చెయ్.. ప్రజ్వల్‌కు వినతి

కేసీఆర్‌ కల చెదిరింది.. తెలంగాణ ఆవిర్భవించి దశాబ్దం.. సీన్‌లోకి సోనియమ్మ

థియేటర్లు బాగానే సంపాదించాయిగా... ఇప్పుడు మొత్తం పోయింది... గోవిందా!

సహచర నటి పవిత్ర ఎడబాటును భరించలేక నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య!!

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

తర్వాతి కథనం
Show comments