ఫిఫా వరల్డ్ కప్ : నేడు పోర్చుగల్‌-స్పెయిన్‌ ఢీ.. అందరి కళ్లూ అతనిపైనే...

రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ 2018 మెగా టోర్నీలో భాగంగా రెండో రోజైన శుక్రవారం పోర్చుగల్, స్పెయిన్ దేశాలకు చెందిన జట్ల మధ్య ఆసక్తికర పోరు జరుగనుంది. ఈ మ్యాచ్ ఫలితం సంగతి అటుంచితే.. అందరి కళ్

Webdunia
శుక్రవారం, 15 జూన్ 2018 (11:31 IST)
రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ 2018 మెగా టోర్నీలో భాగంగా రెండో రోజైన శుక్రవారం పోర్చుగల్, స్పెయిన్ దేశాలకు చెందిన జట్ల మధ్య ఆసక్తికర పోరు జరుగనుంది. ఈ మ్యాచ్ ఫలితం సంగతి అటుంచితే.. అందరి కళ్లు మాత్రం పోర్చుగల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డోపై కేంద్రీకృతమైవున్నాయి.
 
గురువారం జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో సౌదీ అరేబియా జట్టుపై ఆతిథ్య రష్యా 5-0 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో గ్రూప్‌-బిలో భాగంగా జరిగే పోరులో యూరోపియన్‌ చాంపియన్‌ పోర్చుగల్‌-స్పెయిన్‌ తలపడనున్నాయి. 
 
ఈ మ్యాచ్‌లో క్రిస్టియానో రొనాల్డో ప్రధాన ఆకర్షణకానున్నాడు. అద్భుత కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లు అందుకున్నా... 33 ఏళ్ల రొనాల్డోను ఫిఫా కప్‌ ఊరిస్తుండటంతో ఈసారి జట్టుకు ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని అందించి తన కెరీర్‌కు స్వస్తిచెప్పాలని భావిస్తున్నాడు. దాంతో ఫుట్‌బాల్‌ అభిమానులు అతడి చేసే విన్యాసాలను తిలకించాలని ఎదురు చూస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

తర్వాతి కథనం
Show comments