కార్తీక మాసం: శివ నామస్మరణతో తెలుగు రాష్ట్రాలు

Webdunia
సోమవారం, 16 నవంబరు 2020 (09:35 IST)
కార్తీక మాసం ప్రారంభమైంది. కార్తీక మాసంలో వచ్చిన తొలి సోమవారం కావడంతో ఈరోజు శివాలయాలు శివ నామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి. పరమేశ్వరునికి కార్తీక మాసం అంటే ఎంతో ప్రీతికరమైనదని తెలిసిందే.

ఈ కార్తీకమాసంలో సూర్యుడు తులా సంక్రమణలో ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీ జలాల యందు చేరుతుంది. ఈ జలాశయాలలో విష్ణువు వ్యాపించి ఉంటాడు కనుక కార్తీక స్నానం చేసిన వారికి పుణ్యప్రదం. హపీకూప, నదీస్నాన, జపాదులను ఆచరించేవారు అక్షయమైన అశ్వమేధ ఫలాన్ని పొందుతారని విశ్వాసం.
 
స్త్రీలుగాని, పురుషులుగాని కార్తీకమాసంలో తప్పనిసరిగా ప్రాతఃస్నానం ఆచరించాలనీ, కార్తీక మాసపు సాయంకాలం శివాలయాలలోగానీ, వైష్ణవ ఆలయాల్లోగానీ దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలం లభించడమే గాక, శివాలయ గోపురద్వార శిఖరాలయందుగానీ, శివలింగ సన్నిధిని గానీ దీపారాధన చేయడం వలన అన్ని పాపాలు అంతరించి పోతాయి.
 
కార్తీకంలో శివాలయంలో ఆవు నేతితోగాని, నువ్వుల నూనెతో గాని, ఆఖరికి ఆముదంతోగానీ దీప సమర్పణ ఎవరు చేస్తారో, వారు అత్యంత పుణ్యవంతులౌవుతారని, నెల పొడవునా చేసినవాళ్లు జ్ఞానులై, మోక్షాన్ని పొందుతారని చెప్పబడింది.
 
పూర్వ జన్మార్జితాలైన పాపాలన్నీ కూడా కార్తీకవ్రతం వలన హరించుకుపోతాయి. కార్తీకంలో వచ్చే ప్రతి సోమవారం నాడు పగలు ఉపవసించి, రాత్రి నక్షత్ర దర్శనానంతరం భోజనం చేస్తూ ఆ రోజంతా భగవంతుని ధ్యానంలో గడిపేవాళ్లు తప్పక శివ సాయుజ్యాన్ని పొందుతారని విశ్వాసం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డీజే శబ్దానికి గుండెలే కాదు బండ గోడలు కూడా కూలుతున్నాయ్ (video)

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

అన్నీ చూడండి

లేటెస్ట్

16-10-2025 గురువారం దినఫలాలు - విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు...

Diwali 2025: దీపావళి పిండివంటలు రుచిగా వుండాలంటే.. ఈ చిట్కాలు పాటించాల్సిందే..

15-10-2025 బుధవారం ఫలితాలు : మొండిబాకీలు వసూలవుతాయి

Diwali 2025: దీపావళి ఐదు రోజుల వెలుగుల పండుగ.. ఎలా జరుపుకోవాలి?

14-10-2025 మంగళవారం ఫలితాలు - మొండిబాకీలు వసూలవుతాయి.. ఖర్చులు అధికం...

తర్వాతి కథనం
Show comments