Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీరు సోమవారం పుట్టినవారైతే? (video)

Advertiesment
మీరు సోమవారం పుట్టినవారైతే? (video)
, సోమవారం, 28 సెప్టెంబరు 2020 (05:01 IST)
సోమవారం జన్మించిన జాతకులు ప్రతిభావంతులు. వారంలోని రెండవ రోజు అయిన సోమవారం చంద్ర గ్రహానికి సంబంధించింది. ఈ రోజుకు చంద్రుడు ఆధిపత్యం వహిస్తాడు. జ్యోతిషశాస్త్రంలో చంద్రుని గ్రహానికి చాలా ప్రాధాన్యత వుంది. ఇది భూమికి చాలా దగ్గరగా వుంటుంది. అందుకే భూమిపై నివసించే జనులకు చంద్రుని ప్రభావం ప్రతికూల ఫలితాలను అధికంగా ఇస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటూ వుంటారు. 
 
చంద్రుడు ప్రకాశవంతంగా వుంటాడు. చంద్రుడు మనస్సుకు పాలకుడు. ఈ గ్రహం జీవితం, కుటుంబ సంబంధాలకు కారకం. సోమవారం జన్మించిన వ్యక్తులు చంద్రుడిని పూజిస్తే సానుకూల ఫలితాలను పొందవచ్చు. 
 
సోమవారం జన్మించిన పురుషులైనా, మహిళలైనా.. గృహ జీవితంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. సాక్ష్యాలు, ఆధారాల కంటే.. వ్యక్తిగత భావాలకు, అనుభవానికి ప్రాధాన్యత ఇస్తారు. సోమవారం జన్మించిన వారి అదృష్ట సంఖ్య రెండు. ఈ సంఖ్యను ఉపయోగిస్తే ప్రతికూల ఫలితాలుండవు. సోమవారం జన్మించిన జాతకులు సోమవారం శివుడిని, గణేషునిని ఆరాధించడం వల్ల జీవితంలో ఎంతో అనుకూలమైన ఫలితాలు పొందవచ్చు.
 
సోమవారం జన్మించిన జాతకులు కెరీర్‌ పరంగా రాణిస్తారు. వ్యాపారంలో ముందడుగు వేస్తారు. ఉన్నత పదవులను అలంకరిస్తారు. ప్రతి విషయాన్ని శ్రద్ధగా చేస్తారు. చేసే పనిని దైవంగా భావిస్తారు. ఉద్యోగం, వ్యాపారం ఈ రెండింటిలోనూ ఈ జాతకులదే పై చేయి. 
webdunia
moon
 
క్రమశిక్షణగా ప్రవర్తించే ఈ జాతకులు ఇతరులు సులభంగా ఆకట్టుకుంటారు. వాక్చాతుర్యం అద్భుతం. వ్యక్తిగత విషయాలపై అధిక శ్రద్ధ వహిస్తారు. ఇతరులను తేలికగా నమ్మరు. అయితే నమ్మిన వారి కోసం ఏదైనా చేసేందుకు వెనుకాడరు. కుటుంబ సభ్యుల కోసం ఎక్కువ సమయాన్ని వెచ్చించాలనుకుంటారు. సోమవారం జన్మించిన జాతకులు తమకు సానుకూలమైన భాగస్వామినే ఎంచుకుంటారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

28-09-2020 సోమవారం దినఫలాలు - శంఖరుడికి పూజతో సంకల్ప సిద్ధి