Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీలో కలవరం రేపుతున్న సుజనాచౌదరి వ్యాఖ్యలు

Webdunia
శనివారం, 23 నవంబరు 2019 (11:39 IST)
ఏపీలో రాజకీయం భిన్నంగా నడుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కానీ వైసీపీ ఎంపీలు బీజేపీ టచ్‌లో ఉన్నారనే ప్రచారం ఒక్కసారిగా ఊపందుకుంది. దీనికి ఎంపీ సుజనాచౌదరి మాటలు ఆజ్యం పోశాయి. దీంతో వైసీపీ భగ్గుమంది. ఏపీలో ప్రభుత్వం మారిన ఆరునెలలకే వలసల రాజకీయం ఎందుకు హైలెట్ అవుతోందనే ప్రశ్న అందరిలో మెదలుతోంది.
 
సుజనాచౌదరి అనాలోచితంగా అన్నారో.. లేక ప్రీప్లాన్‌గా అన్నారో కానీ బీజేపీలోకి వచ్చేందుకు టీడీపీ, వైసీపీ నేతలు రెడీగా ఉన్నారని చెప్పడం కలకలం రేపుతోంది. 
 
టీడీపీకి ఇలాంటివి అలవాటయిపోయాయి. ఎవరుపోయినా పోతేపోనీ అనుకోవడం తప్ప ఆ పార్టీకి మరోదారి లేదు. ఎందుకంటే టీడీపీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది. కానీ వైసీపీ పరిస్థితి అలా కాదు. తిరుగులేని విజయం సాధించి అధికారంలోకి వచ్చిన పార్టీ. 25కు 22 మంది ఎంపీలు గెలిచారు. 175కు 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. 
 
అంతలా విజయం సాధించిన తర్వాత ఆ పార్టీ నేతలు పక్క చూపులు చూస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అది కూడా ఆరునెలల్లో అంటే ఏదో తేడా జరుగుతోందనే లెక్క. అందుకు సుజనా మాటలు ఒక్కసారిగా ప్రకంపనలు రేపాయి. ఆ ప్రకంపనలు సుజనాపై మాటల తూటాల రూపంలో బయటకు వచ్చాయి. రోజంతా వైసీపీ ఎంపీలు, సుజనాపై ముకుమ్మడి దాడి చేశారు. 
 
ఢిల్లీలో ఎంపీలు ప్రత్యేకంగా సమావేశం పెట్టి సుజనాపై మండిపడ్డారు. తమలో ఎవరు బీజేపీ టచ్‌లో ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
 
ఎంపీల మీడియా సమావేశానికి కొంతమంది ఎంపీలు రాలేదు. అలాగే రెండు రోజుల కిందట ఎంపీ విజయసాయిరెడ్డితో జరిగిన సమావేశానికి కొంతమంది డుమ్మా కొట్టారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన ఎంపీలు కానీ మంత్రులు, ఇతర నేతలు సుజనాపై విమర్శల్లో ఓ స్పష్టమైన అడ్డుగీత గీసుకున్నారు.
 
విమర్శల్లో ఓ స్పష్టమైన అడ్డుగీత గీసుకున్నారు. అదేంటంటే బీజేపీని పల్లెత్తు మాట అనకపోవడం. సుజనాచౌదరిని విమర్శించడంలో ఓ కచ్చితమైన లైన్ పాటించారు. సుజనాను వ్యక్తిగతంగా విమర్శించారు. సుజనాకు టీడీపీకి లింక్ పెట్టారు. కానీ ఇప్పుడు సుజనా ఉన్న బీజేపీపై నోరు జారకపోవడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments