Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేన పార్టీ అధ్యక్షుడిగా చిరంజీవి.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారా?

మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నారా? పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టబోతున్నారా? రాజకీయాల్లో అన్నాదమ్ముళ్లు ఏకం కానున్నారా? అంటే అవుననే అంటున్నారు.. సిన

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2017 (10:52 IST)
మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నారా? పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టబోతున్నారా? రాజకీయాల్లో అన్నాదమ్ముళ్లు ఏకం కానున్నారా? అంటే అవుననే అంటున్నారు.. సినీజనం. ఏపీలో మూడు రోజుల పాటు పర్యటించిన జనసేనాని.. అన్నయ్య ప్రజారాజ్యం పార్టీని తలచి భావోద్వేగానికి గురైన సంగతి తెలిసిందే. 
 
అన్న పార్టీ గంగలో కలిసిపోయేందుకు గల కారణాలను కూడా వివరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్నయ్యను పూర్తి స్థాయి సినిమాలు చేయమంటూనే.. జనసేనలో కీలక బాధ్యతలను పవన్ చిరంజీవికి అప్పగించే పనుల్లో వున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేగాకుండా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నయ్య, తమ్ముడు ఇద్దరూ కలిసి పోటీ చేస్తారని టాలీవుడ్‌లో చర్చ సాగుతోంది. 
 
సోషల్ మీడియాలోనూ చిరంజీవి, పవన్ కల్యాణ్‌ను జనసేన ఏకం చేయనుందని టాక్ వస్తోంది. పీఆర్పీని స్థాపించిన మెగాస్టార్ చిరంజీవి.. అధికారాన్ని సొంతం చేసుకోవడంలో విఫలమై.. ఆపై పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అటు పిమ్మట కాంగ్రెస్‌లో కేంద్ర మంత్రి పదవిని, ఎంపీగానూ కొనసాగారు. కానీ ప్రస్తుతం రాజకీయాలకు చిరంజీవి దూరంగా వుంటున్నారు.
 
కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో చిరంజీవి పాల్గొనేందుకు ఆసక్తి చూపట్లేదు. సినిమాలపై పూర్తిగా దృష్టి పెట్టేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున చిరంజీవి ఎంత కష్టపడినా ప్రయోజనం వుండదని తెలుసుకున్న ఆయన ఆ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఆపై చిరంజీవి త్వరలో జనసేనలోకి వస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చిరంజీవిని కూడా జనసేనలో కలుపుకోవాలని పవన్ కూడా సిద్ధంగా వున్నట్లు సమాచారం. అంతేగాకుండా జనసేన పార్టీ అధ్యక్షులుగా ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి దీనిపై పవన్ ఎప్పుడు ప్రకటన చేస్తారో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments