Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'మనం సైతం'కు చిరంజీవి విరాళం... కాదంబరికి అభినందనలు

మెగాస్టార్ చిరంజీవి విరాళం చేశారు. మనం సైతం కార్యక్రమానికి ఆయన తన వంతు సాయంగా రూ.2 లక్షలు విరాళంగా ఇచ్చారు. అలాగే, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సినీ నటుడు కాదంబరి కిరణ్‌ను కూడా అభినందించారు.

Advertiesment
'మనం సైతం'కు చిరంజీవి విరాళం... కాదంబరికి అభినందనలు
, మంగళవారం, 12 డిశెంబరు 2017 (10:18 IST)
మెగాస్టార్ చిరంజీవి విరాళం చేశారు. మనం సైతం కార్యక్రమానికి ఆయన తన వంతు సాయంగా రూ.2 లక్షలు విరాళంగా ఇచ్చారు. అలాగే, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సినీ నటుడు కాదంబరి కిరణ్‌ను కూడా అభినందించారు. 
 
నిజానికి కాదంబరి కిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'మనం సైతం' పేరుతో ఎంతోమందికి సాయం చేస్తున్నారు. ముఖ్యంగా, జనాలకోసం, కష్టాల్లో ఉన్న పేదవాళ్ళకోసం, ఆపదలో ఉన్న సినిమావాళ్ళ కోసం, ఇంకా ఎవరైనాకానీ, విద్య, వైద్యం, ఆరోగ్యం, పెళ్లి, చావు కష్టం ఏదైనా.. తమవంతు సాయపడాలన్న తపనతో ఆయన మనం సైతంను అనే వేదికను ఏర్పాటు చేశారు. 
 
వాస్తవానికీ మనం సైతం అనేది ఓ వాట్సాప్ గ్రూపు. ఇది స్నేహితులు, సన్నిహితులు, తోటినటులతో ప్రారంభమైంది. ఇప్పుడు గాయనీగాయకులు, సామాజికవేత్తలు, శ్రేయోభిలాషులు, సేవాగుణంగల డాక్టర్లు, లాయర్లు, జర్నలిస్టులు.. ఇలా తమ సొంత హోదాలతో పనిలేకుండా.. ఎంతోమంది ముందుకు వచ్చి తనవంతు సాయం చేస్తున్నారు. ఇందుకోసం వారు ఆ గ్రూపుల్లో చేరారు కూడా. 
 
ఇలా సరికొత్త ఆలోచనతో ఎంతో మంది పేదలను ఆదుకుంటున్న కాదంబరిని చిరంజీవి ప్రత్యేకంగా అభినందించడమే కాకుండా, మనం సైతంకు తన వంతుగా 2 లక్షల రూపాయలను చిరంజీవి విరాళంగా ఇచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#HBDSuperStarRajinikanth : ఎవర్ గ్రీన్ యాంగ్రీయంగ్ హీరో