శ్రావణ మంగళవారం మంగళగౌరీ వ్రతాన్ని..?

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (00:05 IST)
శ్రావణమాసం మంగళవారం మంగళగౌరీ వ్రతాన్ని విధిగా ప్రారంభించి ఐదు సంవత్సరాలు దీక్షగా ఆచరించాలి. అలా ఈ వ్రతాన్ని చేపట్టిన స్త్రీలపై శ్రీ మంగళగౌరి కటాక్షముతో వైధవ్యబాధలు లేకుండా వారీ జీవితాంతం సర్వ సౌఖ్యములతో గడుపుతారని పురోహితులు అంటున్నారు. 
 
శ్రావణంలోని ప్రతి మంగళవారం కొత్తగా పెళ్లైన స్త్రీలు మాంగల్యానికి అధిదేవత ‘గౌరీదేవి’ని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగల్యాన్ని పదికాలలపాటు పచ్చగా కాపాడమని కోరుతూ వివాహమైన సంవత్సరం మొదలు కొని ఐదేళ్లపాటు ఆచరించే వ్రతమే ‘మంగళగౌరీ వ్రతం’.
 
శ్రావణ మంగళవారం వ్రతం ఆచరించేవారు మొదటి సంవత్సరం అయిదుగురు ముత్తయిదువులనీ, రెండవ సంవత్సరం పదిమందినీ, మూడో యేడు పదిహేను మందినీ, నాలుగో ఏట ఇరవై మందినీ, అయిదవ సంవత్సరం ఇరవై అయిదు మంది ముత్తయిదువులనూ పిలిచి, పసుపు రాసి, బొట్టు పెట్టి, కాటుకిచ్చి, శనగలూ కొబ్బరీ. పండు, తాంబూలంతో వాయనాలిస్తారు.. కుదిరితే అందరి ముత్తైదువలను ఇంటికి పిలిచి వాయినాలు ఇస్తారు.. లేదంటే వారి ఇంటికే వెళ్లి వాయినాలు ఇస్తూ ఉంటారు.
 
తొలిసారిగా నోమును ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్నవారి తల్లి ప్రక్కనే వుండి వ్రతాన్ని చేయించడం శ్రేష్టం. అలాగే తొలి వాయనాన్ని తల్లికే ఇవ్వడం మంచిది. మంగళగౌరీవ్రతమును ఆచరించే అల్పాయుష్కుడైన తన భర్తను గండముల నుంచి తప్పించి దీర్ఘసుమంగళిగా వర్ధిల్లిందని పురాణాలు చెబుతు న్నాయి. అందుచేత శ్రావణమాసంలో వచ్చే మంగళవారం పూట కొత్తగా పెళ్లైన స్త్రీలు గౌరీమాతను దీక్షతో ప్రార్థిస్తే సర్వమంగళం చేకూరుతుందని విశ్వాసం

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికా సైన్యంలో కీలక పరిణామం... ఆర్మీ చీఫ్ జార్జ్ తొలగింపు

ఇరాన్‌ను రాతి యుగంలోకి పంపుతాం.. ఎత్తైన వంతెనను పేల్చివేసిన అమెరికా

బతికుండగా వారిని కలవనివ్వలేదు ... కనీసం చావులోనైనా వాళ్లను కలిసుండనీయండి...

ఏపీ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్.. రానున్న రెండు రోజులు జాగ్రత్త

పాకిస్థాన్‌లో మళ్లీ భగ్గుమన్న ఇంధన ధరలు - లీటర్ డీజిల్ ధర రూ.520

అన్నీ చూడండి

లేటెస్ట్

01-04-2026 నుంచి 30-04- 2026 వరకు మాస ఫలితాలు- సత్కాలం సమీపిస్తుంది..

31-03-2026 మంగళవారం ఫలితాలు - తప్పులు దొర్లే ఆస్కారం ఉంది..

30-03-2026 సోమవారం ఫలితాలు - మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది...

29-03-2026 ఆదివారం ఫలితాలు- రుణ సమస్య నుంచి గట్టెక్కుతారు..

29-03-2026 నుంచి 04-04-2026 వరకు మీ వార ఫలితాలు- ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి..?

తర్వాతి కథనం
Show comments