Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో మరో నిర్భయ ఘటన : కారులో యువతిపై సామూహిక అత్యాచారం

Webdunia
శనివారం, 27 నవంబరు 2021 (11:56 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో నిర్భయ ఘటన జరిగింది. కదులుతున్న కారులో ఓ యువతిపై ప్రియుడితో పాటు మరో ఇద్దరు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత యువతి ఎస్.ఐ. ఉద్యోగం నిర్వహించిన రాత పరీక్షకు హాజరై ఇంటికి తిరిగి వెళుతుండగా ఈ దారుణం జరిగింది. దీనిపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోసికల పోలీసులు కేసు నమోదు చేసి ప్రధాన నిందితుడుని అరెస్టు చేశారు. 
 
పోలీసుల కథనం మేరకు.. బాధిత యువతికి ఫేస్‌బుక్ ద్వారా హర్యానా రాష్ట్రంలోని పాల్వాల్‌కు చెందిన తేజ్‌వీర్ అనే యువకుడు పరిచయమయ్యాడు. కొన్నాళ్ళ ఫేస్‌బుక్ పరిచయం తర్వాత ఫోన్లు నంబర్లు ఇచ్చిపుచ్చున్నారు. పిమ్మట ఫోనులో తరచూ మాట్లాడుకోసాగారు. ఈ క్రమంలో ఇటీవల ఎస్ఐ ఉద్యోగాల కోసం ఆగ్రాలో జరిగిన రాతపరీక్షకు వెళుతున్నట్టు తేజ్‌వీర్‌కు యువతి చెప్పింది. 
 
అంతే.. ఇదే అదనుగా భావించిన తేజ్‌వీర్ తాను వస్తానని చెప్పి ఓ కారులో తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమె వద్దకు బయలుదేరారు. రాత పరీక్ష పూర్తయిన తర్వాత ఆమె వద్దని ఎంతగానో వారించినప్పటికీ ఇంటి వద్ద దింపుతామని చెప్పిన ఆమెను కారులో ఎక్కించుకున్నారు. ఆ తర్వాత ఆ యువతికి మత్తు మందిచ్చి కారులోనే అత్యాచారానికి తెగబడ్డాడు. 
 
ఆ తర్వాత తన ఇద్దరు స్నేహితులతో కలిసి లైంగికదాడి చేయించాడు. దీంతో ఆమె అపస్మారకస్థితిలోకి జారుకోగానే ఆగ్రా - ఢిల్లీ జాతీయ రహదారి పక్కన పొలాల్లో వదిలేసి హర్యానాకు వెళ్లిపోయారు. రోడ్డుపక్కన పడివున్న యువతిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం వేశారు. 
 
దీంతో అక్కడకు చేరుకుని పోలీసులు ఆ యువతిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు. అలాగే, నిందితులు ఉపయోగించిన కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments