Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు కార్లలో ఎర్ర చందనంతో దొరికిపోయిన వైసిపి నేత?

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (16:13 IST)
ఆయన అధికార పార్టీ నాయకుడు. ప్రజలకు సేవ చేసి.. మంచి పేరు తెచ్చుకోవాల్సిన ఆయనే పెడదారి పట్టాడు. డబ్బులు సంపాదించాలన్న దురుద్ధేశంతో ఎర్రచందనం అక్రమ రవాణానే మార్గంగా ఎంచుకున్నాడు. ఒకటి రెండు కాదు కోట్ల రూపాయల విలువ చేసే ఎర్రచందనాన్ని రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. 

 
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగల్లు మండల జడ్పీటీసీ భర్త మహేశ్వర్ రెడ్డి రెండు ఇన్నోవాలతో సహా 16 ఎర్రచందనం దుంగలతో పట్టుబడ్డాడు. పోలీసుల అదుపులో ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లు ప్రస్తుతం ఉన్నారు. 

 
చిత్తూరు జిల్లా పీలేరులో తెల్లవారుజామున రెండు ఇన్నోవాలతో సహా ఎర్రచందనంను గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా వారు చిన్న గొట్టిగల్లు జడ్పీటీసీ భర్త మహేశ్వర్ రెడ్డి, అతని అనుచరులు మునీశ్వర్, క్రిష్ణయ్యగా గుర్తించారు. 
 
అధికార పార్టీ నేత ఎర్రచందనం స్మగ్లింగ్‌లో పట్టుబడడంతో పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారట. మీడియాను సైతం లోపలికి అనుమతించడం లేదట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments