Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళ ఛాతిని తాకడం అత్యాచారం కిందకు రాదా? కేంద్ర మంత్రి ఫైర్

ఠాగూర్
శుక్రవారం, 21 మార్చి 2025 (12:10 IST)
ఓ అత్యాచార కేసు విచారణ సందర్భంగా ఇటీవల అలహాబాద్ కోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపడంతో పాటు తీవ్ర వివాదానికి దారితీశాయి. మహిళ ఛాతిని తాకడం అత్యాచారం కిందకు రాదని న్యాయమూర్తి కేసు విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు. 
 
ఈ వ్యాఖ్యలపై కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖామంత్రి అన్నపూర్ణ దేవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తీర్పు ఏమాత్రం సమ్మతం కాదని వ్యాఖ్యానించారు. న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను పునఃపరిశీలన చేయాలని కోరారు. ఇలాంటి తీర్పులతో సమాజంలోకి తప్పుడు సందేశం వెళ్లే అవకాశం ఉందని ఆమె వ్యాఖ్యానించారు. 
 
రోజూ కాసులిస్తేనే పక్కలోకి రండి - భార్య షరతు.. 
 
సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో నానాటికీ ధన ఆశ పెరిగిపోయింది. ముఖ్యంగా, భార్యాభర్తలు కూడా డబ్బు ఆశలోపడి తమ పండంటి సంసార జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. రోజుకు రూ.5 వేల చొప్పున ఇస్తేనే భార్య తనతో కాపురం చేస్తానంటోంది. ఆపై నిత్యం వేధింపులు గురిచేస్తోందని శ్రీకాంత్ అనే టెక్కీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరకు ప్రశాంతంగా ఉద్యోగం కూడా చేయకుండా ఇబ్బందులు పెడుతోందని వాపోతున్నాడు. ఈ ఘటన బెంగుళూరు నగరంలోని వయ్యాలికావల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 
 
పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను పరశీలిస్తే, శ్రీకాంత్ ఓ యువతితో 2022లో వివాహమైంది. సంపిగెహళ్లిలో కాపురం పెట్టారు. ఇంటి నుంచి ఉద్యోగం చేస్తున్న అతడిని భార్య నిత్యం వేధిస్తుంది. జూమ్ ద్వారా విధులకు హాజరయ్యే సమయంలో మధ్యలో వచ్చి డ్యాన్స్‌లు చేస్తోంది. అకారణంగా దూషిస్తుంది. కాపురం చేయాలంటే షరతులు పెడుతోంది. 
 
అడిగినన్ని డబ్బులు ఇవ్వకున్నా, చెప్పింది చేయకున్న బలవన్మరణానికి పాల్పడతానంటూ బెదిరింపులకు దిగుతోంది. కనీసం విడాకులు ఇవ్వమన్నా రూ.45 లక్షలు డిమాండ్ చేస్తుంది. అయితే, దీనిపై అతడి భార్య కథనం మరోలా ఉంది. మరో పెళ్లి చేసుకునేందుకు శ్రీకాంత్ పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశాడని తెలిపారు. ఆడియోలు, వీడియోలను ఎడిట్ చేసి తనపై నిందలు వేస్తున్నాడని ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gowtam: మహేష్ బాబు కుమారుడు గౌతమ్ నటుడిగా కసరత్తు చేస్తున్నాడు

Sapthagiri: హీరో సప్తగిరి నటించిన పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments