Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నబిడ్డపై ప్రియుడు అత్యాచారం చేస్తుంటే గుడ్లప్పగించి చూసిన కన్నతల్లి!!

ఠాగూర్
సోమవారం, 7 ఏప్రియల్ 2025 (08:24 IST)
కేరళ రాష్ట్రంలో అమానుష ఘటన ఒకటి వెలుగు చూసింది. తన కళ్లముందే కన్నబిడ్డపై తన ప్రియుడు అత్యాచారం చేస్తుంటే ఓ కసాయి తల్లి గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయింది. తన బిడ్డను కంటికి రెప్పలా కాపాడాల్సిన ఆ తల్లి.. ప్రియుడు చేస్తున్న పాడుపనులకు వత్తాసు పలికింది. ఈ కేసులో ఆ తల్లికి 40 యేళ్ల జైలుశిక్ష పడింది. ఈ మేరకు తిరువనంతపురం కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మానసికస్థితి సరిగ్గాలేని భర్తను వదిలిపెట్టి తన 7 యేళ్ల కుమార్తెను తీసుకుని ఓ మహిళ శిశుబాలన్ అనే వ్యక్తితో ఉండసాగింది. ఈ క్రమంలో ఏడేళ్ల మైనర్ బాలికపై కన్నేసిన కామాంధుడు... ఆ చిన్నారిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. పైగా, కన్నతల్లి ముందే అత్యాచారం చేసేవాడు. తన ప్రియుడు పనులను ఆ మహిళ చూస్తూ మిన్నకుండిపోయేది. దీంతో శిశుబాలన్ మరింతగా రెచ్చిపోసాగాడు.
 
ఈ క్రమంలో తమ ఇంటికి చుట్టపుచూపుగా వచ్చిన 11 యేళ్ల బాలికపై కూడా శిశుబాలన్ అత్యాచారానికి ఒడిగట్టాడు. అయితే, బాధిత బాలిక తనపై జరిగిన అఘాయిత్యాన్ని ఆ మహిళ తల్లికి చెప్పింది. దాంతో ఆమె తన కుమార్తెకు ఫోన్ చేసి సమాచారం చెప్పింది. పైగా, శిశుబాలన్‌కు దూరంగా ఉండాలని చెప్పింది. కానీ, ఆమె తల్లిమాటలు వినిపించుకోలేదు. 
 
ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత తనంతట తానే అతనికి దూరమై మరో వ్యక్తితో కలిసి జీవించసాగింద. అతడు కూడా ఏడేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ చిన్నారి అనుభవిస్తున్న నరకాన్ని చూసిన పెద్దమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసల విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక తల్లి, ఆమె రెండో ప్రియుడుని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణ తిరువనంతపురం ఫాస్ట్ ట్రాక్ కోర్టులోసాగింది దీంతో కన్నకుమార్తె పట్ల కర్కశంగా ప్రవర్తించిన తల్లికి న్యాయస్థానం 40 యేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments