Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికి ముందే యువకుడితో పరిచయం, భర్తను సాధించిన భార్య, చివరికి...

Webdunia
బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (18:04 IST)
తన భార్య వయస్సు పైడిన తన తల్లిదండ్రులు బాగా చూసుకుంటుందని భావించాడు ఆ భర్త. పెళ్ళి జరిగింది. కానీ భార్య కుటుంబ సభ్యులను బాధపెట్టేలా వ్యవహరించడం.. కుటుంబ సభ్యులను హేళనగా మాట్లాడటం జీర్ణించుకోలేకపోయాడు. భార్యను మారుద్దామనుకుని చివరకు తానే ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు.

 
ఢిల్లీలోని రోహిణి అపార్టుమెంటులో నివాసముంటున్నారు ప్రదీప్. సరిగ్గా 8 సంవత్సరాల క్రితం సీమ అనే యువతితో అతనికి పెళ్ళి జరిగింది. ప్రదీప్ ఒకే కొడుకు. తల్లిదండ్రులకు వయస్సు కూడా పైబడింది. 

 
దీంతో తను కట్టుకున్న భార్య సంసారాన్ని చక్కదిద్దుకుని సాఫీగా కుటుంబాన్ని నడుపుతుందని భావించాడు. కానీ అంతా రివర్స్ అయ్యింది. సీమకు పెళ్ళికి ముందే గౌరవ్ అనే యువకుడితో పరిచయం ఉంది.

 
గౌరవ్ తన ఇంటికి సమీపంలోని వ్యక్తి. వీరిద్దరికి శారీరక సంబంధం వుంది. కానీ వివాహాన్ని సీమ తల్లిదండ్రులు ప్రదీప్‌తో నిశ్చయించడంతో చేసేది లేక అతడినే చేసుకుంది. కానీ సంసారం ప్రదీప్‌తో కాకుండా గౌరవ్ తోనే  రహస్యంగా చేసేది.

 
తరచూ ప్రదీప్‌తో ఏదో ఒక గొడవ పెట్టుకునేది. దీంతో ప్రదీప్ కుమిలిపోయాడు. భార్యను మారుద్దామనుకున్నాడు. 8 సంవత్సరాల కాపురంలో పిల్లలు పుట్టలేదు. సంసారం కాస్త గందరగోళంగా ఉండిపోవడం.. కోడలు పెట్టే హింస తట్టుకోలేక ఇంట్లో నుంచి అత్తమామలు వెళ్లిపోయారు కూడా. 

 
దీంతో ప్రదీప్, భార్య ఉన్నా ఒంటరి అయిపోయాడు. గౌరవ్ వ్యవహారం చాలా సంవత్సరాల పాటు ప్రదీప్‌కు తెలియదు. అయితే నెల క్రితం విషయం బయటపడింది. గౌరవ్‌తో అక్రమ సంబంధం వద్దని ప్రదీప్ ప్రాధేయపడ్డాడు. అయినా సీమ మారలేదు.

 
దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ప్రదీప్ ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాను పడిన నరకయాతన, ఇంట్లో అనుభవించిన బాధలన్నింటినీ ఒక పేపర్ పైన ఉంచి మరీ చనిపోయాడు ప్రదీప్.  

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments