Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

66 ఏళ్ల వ్యక్తి 27 మందిని పెళ్లాడాడు.. ఆ నిత్య పెళ్లికొడుకు గురించి తెలిస్తే?

Advertiesment
66 ఏళ్ల వ్యక్తి 27 మందిని పెళ్లాడాడు.. ఆ నిత్య పెళ్లికొడుకు గురించి తెలిస్తే?
, మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (22:49 IST)
ఒడిశాకు చెందిన నిత్య పెళ్లి కొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు.  వివరాల్లోకి వెళితే.. బిభు ప్రకాశ్ స్వైన్ ఒడిశాకు చెందిన వ్యక్తి. వృత్తిరీత్యా ఓ ల్యాబ్ టెక్నీషియన్. మొదటి భార్య నుంచి విడిపోయి భువనేశ్వర్ కు వచ్చి నిత్య పెళ్లికొడుకుగా మారాడు. 
 
ధనం, కామంతో ఈ మోసాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కాగా, తాను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నానంటూ నకిలీ ఐడీలు, అపాయింట్ మెంట్ లెటర్లు ఉపయోగించి.. తనకు పెద్ద మొత్తంలో జీతం వచ్చేదని నమ్మబలికేవాడు. 
 
ఒంటరిగా వున్న మహిళలను గాలం వేసేవాడు. ఇలా ఢిల్లీకి చెందిన ఓ మహిళ కూడా బిభు ప్రకాశ్ మోసానికి బలైంది. ఆమె అతడికి 14వ భార్య. ఆమె పోలీసులను ఆశ్రయించడంతో అతడి గుట్టురట్టయింది.
 
అతడి ఫోన్ డేటాను పరిశీలించిన పోలీసులు షాకయ్యారు. మేడమ్ ఢిల్లీ, మేడమ్ యూపీ, మేడమ్ అసోం అంటూ తాను పెళ్లి చేసుకున్న మహిళల పేర్లను ఫోన్ లో ఫీడ్ చేసుకున్నాడు. ఇక, పోలీసులు దర్యాప్తులో  షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. 
 
పెళ్లి చేసుకోవడం, వారితో కొన్నిరోజుల పాటు తన లైంగిక అవసరాలు తీర్చుకోవడం, ఆపై నగలు, డబ్బుతో పరారవడం అతడి నైజం. 40 ఏళ్లకు పైబడిన ఒంటరి మహిళలు, వితంతు, విడాకులు తీసుకున్న వారినే టార్గెట్ చేసి మోసాలకు పాల్పడ్డాడని..  ఇలా 27 మందిని పెళ్లాడాడని చెప్పారు. 
 
అంతేగాకుండా అతడు బ్యాంకులను కూడా మోసం చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. 128 తప్పుడు క్రెడిట్ కార్డులతో 13 బ్యాంకులను రూ.1 కోటి మేర మోసం చేసినట్టు గుర్తించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వన్‌ప్లస్ ఇండియా సరికొత్త వన్‌ప్లస్ టీవీ Y1S- వన్‌ప్లస్ టీవీ Y1S ఎడ్జ్‌లు