Webdunia - Bharat's app for daily news and videos

Install App

శవాల వద్ద నెత్తురు కూడా తినే సన్నాసులు : : ప్రభుత్వ విప్

Webdunia
బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (17:50 IST)
టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణపై ఏపీ ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బండారును ఓ బడుద్ధాయిగా ప్రభుత్వ విప్ అభివర్ణించారు. టీడీపీ నేతలు శవాల వద్ద నెత్తురు కూడా తినే సన్నాసులు అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. 
 
తూర్పు గోదావరి జిల్లాలో అధికార, వైకాపా నేతల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గున మండిపోయేలా వుంది. దీంతో ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఈ క్రమంలో బండారు సత్యనారాయణనను ఉద్దేశించి ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా మాట్లాడుతూ టీడీపీలో బండారు వంటి లుచ్ఛా నాయకులే ఉన్నారు. 
 
అకాల మరణం చెందిన వివాద రహితుడైన మంత్రి గౌతం రెడ్డిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి నీకు సిగ్గులేదా అని ప్రశ్నించారు. బండారూ.. నిన్ను ఈ వ్యాఖ్యలు చంద్రబాబు చేయమన్నాడా? అంటూ నిలదీశారు. 
 
ఇకపోతే యనమల రామకృష్ణుడుకి తునిలో సత్తా లేకే పక్క జిల్లాలోని పత్తా లేని నాయకులను తీసుకొచ్చి మీటింగులు పెడుతున్నారంటూ మండిపడ్డారు. యనమల ఒక ముసలోడు, ఆ ముసలోడు యువత కోసం మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. 
 
సీఎం పెట్టుబడుల గురించి ఒత్తిడి తేవడం వల్లే మంత్రి గౌతం రెడ్డికి గుండెపోటుకు గురయ్యారని, దీనిపై విచారణ జరిపించాలంటూ టీడీపీ నేతల డిమాండ్ చేయడంతో వైకాపా నేతలు ఓ రేంజ్‌లో మండిపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments