Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను పట్టించుకోని భర్త.. భర్తపై సలసల కాగే నూనె పోసిన భార్య.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2022 (09:41 IST)
కట్టుకున్న భార్యను నిర్లక్ష్యం చేసిన భర్తకు తగినశాస్తి జరిగింది. భర్తపై సలసలకాగే నూనెను భార్య పోసింది. పిల్లల చదువుల కోసం మూడున్నరేళ్ళ క్రితం విజయవాడ నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చాడు. అక్కడ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని, ఐదు నెలల తర్వాత ఇంటికి వచ్చాడు. ఆ వెంటనే భర్తతో వాగ్వివాదానికి దిగి క్షణికావేశంలో వేడివేడి నూనె పోసింది. 
 
పోలీసుల వెల్లడించిన కథనం మేరకు.. విజయవాడలోని సింగ్‌నగర్‌కు చెందిన గిరిధర్‌లాల్ (50) మాంసం వ్యాపారి. పిల్లల చదువుల కోసం మూడున్నరేళ్ల క్రితం భార్య రేణుక (40), కుమార్తె, ఇద్దరు కుమారులతో కలిసి హైదరాబాద్ చేరుకున్నాడు. 
 
జియాగూడ కబేళాలో పనిచేస్తూ దరియాబాగ్‌లో ఉంటున్నాడు. గత కొన్ని రోజులుగా గిరిధర్‌లాల్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. భార్య పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు.
 
పరాయి స్త్రీలపై వ్యామోహం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఐదు నెలలుగా ఓ మహిళ వద్ద ఉంటూ మూడు రోజుల క్రితమే తన వద్దకు వచ్చినట్టు రేణుక ఆరోపించింది. దీంతో భార్యాభర్తల మధ్య వాగ్వివాదం జరిగింది. నిన్న మరోమారు ఇద్దరి మధ్య ఈ విషయంలో గొడవ జరిగింది. 
 
దీంతో ఆవేశానికి గురైన రేణుక వంటింట్లోకి వెళ్లి కడాయిలో ఉన్న మరుగుతున్న నూనెను తీసుకొచ్చి భర్త తలపై పోసింది. తీవ్రంగా గాయపడిన గిరిధర్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, భర్త గిరిధర్‌పై గతంలో విజయవాడలోనూ రేణుక ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments