Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన విద్యార్థులకు ఎన్.ఎం.సి శుభవార్త..

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2022 (09:01 IST)
ఉక్రెయిన్ దేశంలో గత ఫిబ్రవరి నెలలో రష్యా దేశం దండయాత్ర ప్రారంభించింది. ఇది ఇంకా కొనసాగుతూనే వుంది. ఉక్రెయిన్  - రష్యా దేశాల మధ్య సాగుతున్న యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లోని వివిధ విద్యా సంస్థల్లో చదువుకునే వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు తమతమ దేశాలకు తరలివెళ్లిపోయారు. ఇలాంటి వారిలో భారతీయ విద్యార్థులు కూడా ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని వివిధ యూనివర్శిటీల్లో వైద్య కోర్సులు అభ్యసిస్తూ వచ్చిన భారతీయ వైద్య విద్యార్థులకు జాతీయ మెడికల్ కౌన్సిల్ శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు ఉక్రెయిన్ వర్సిటీల్లో చదివిన వైద్య విద్యార్థులు ఇకపై భారత్‌లోని మెడికల్ కాలేజీల్లోనూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర మెడికల్ కాలేజీల్లోనూ చేరేందుకు అనుమతించింది. 
 
గతంలో విదేశీ వర్సిటీల్లో చదివే భారత విద్యార్థులు కోర్సు మధ్యలో కాలేజీ మారడం వీలయ్యేది కాదు. కోర్సు యావత్తు ఒకే కాలేజీలో చదవాల్సి వచ్చేది. ట్రైనింగ్, ఇంటర్న్ షిప్, అదే విదేశీ వర్సిటీలో పూర్తిచేయాల్సి వచ్చేది. 
 
అయితే, వందల సంఖ్యలో వైద్య విద్యార్థుల పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న ఎన్ఎంసీ కాలేజీ బదిలీ వెసులుబాటు కల్పించింది. అటు, ఉక్రెయిన్ కూడా భారత విద్యార్థుల ట్రాన్సఫర్‌కు సమ్మతించినట్టు తెలుస్తోంది. ఈ బదిలీ కార్యక్రమం ద్వారా విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర మెడికల్ కాలేజీల్లో చదివినప్పటికీ సర్టిఫికెట్ మాత్రం ఉక్రెయిన్‌లోని మాతృ కళాశాల పేరిటే మంజూరు చేస్తారని ఎన్ఎంసీ తాజా ప్రకటనలో వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments