ఆసియా కప్ సూపర్ - 4 మ్యాచ్‌లో భాగంగా మంగళవారం భారత్, శ్రీలంక జట్ల మధ్య కీలక మ్యాచ్ ప్రారంభమైంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. దుబాయ్ వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్‌కు దిగింది. ఈ సిరీస్‌లో ఫైనల్‌కు చేరాలంటే భారత్ శ్రీలంకతో పాటు.. మరో ఆప్ఘనిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిచి తీరాల్సిన నిర్బంధ పరిస్థితి నెలకొంది.
కాగా, పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా భారత్ టాస్ ఓడిన విషయం తెల్సిందే. ఈ మ్యాచ్‌లో భారత్ ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇదిలావుంటే, శ్రీలంక కోసం ప్రకటించిన జట్టులో ఒకే ఒక్క మార్పు చేసారు. బిష్ణోయి స్థానంలో అశ్విన్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన ఇరు జట్ల వివరాలను పరిశీలిస్తే,
భారత్ : రోహిత్, రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్, రిషభ్ పంత్, పాండ్యా, హుడా, భువనేశ్వర్, రవిచంద్రన్ అశ్విన్, చాహల్, అర్షదీప్.
శ్రీలంక : నిస్సంక, మెండిస్, ఆశలంక, గుణతిలక, శనక, రాజపక్స, హసరంగ, కరుణరత్నే, తీక్షణ, ఫెర్నాండో, మదుశంక.