బావ పొందు కోసం భర్తను రూ.50,000 సుపారి ఇచ్చి హత్య చేయించిన భార్య

ఐవీఆర్
శనివారం, 17 మే 2025 (14:18 IST)
బావతో ఏర్పడిన అక్రమ సంబంధం భర్తను హత్య చేసేంతవరకూ వెళ్లిపోయింది ఆ మహిళ. మెదక్ జిల్లా లోని శమ్నాపూర్‌కు చెందిన 28 ఏళ్ల మైలీ శ్రీనుతో లింగాసాన్ పల్లికి చెందిన లతతో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా. ఐతే వరసకు బావ అయ్యే మైలీ మల్లేశం తరచూ వీరి ఇంటికి రావడం ప్రారంభించాడు. ఈ క్రమంలో లత-మల్లీశం మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడింది. తన భార్య ప్రవర్తనలో వచ్చిన తేడాను గమనించిన శ్రీను ఆమెను ఓసారి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగింది. ఐతే పెద్దలు ఏదో మొదటిసారి తప్పు కనుక వదిలేసి హాయిగా కాపురం చేసుకోమని సలహా ఇచ్చారు.
 
కానీ లత మాత్రం మల్లీశంను వదల్లేకపోయింది. తరచూ మల్లీశంను కలుస్తూ తన సంబంధాన్ని కొనసాగించింది. మళ్లీ ఏదో ఒకరోజు తన భర్తకు తెలిసిపోతుందని, సంతోషంగా గడపడం సాధ్యం కాదని భర్తను అడ్డుతొలగించుకోవాలని మల్లీశ్ కు విషయం చెప్పింది. తన భర్తను హత్య చేస్తే ఇద్దరం కలిసి హాయిగా వుండవచ్చని చెప్పింది. దీనితో మల్లేశం తన స్నేహితుడు మలిశెట్టి మోహన్‌ను రంగంలోకి దించాడు. తన భర్త శ్రీనుని హత్య చేస్తే రూ. 50 వేలు ఇస్తానని అతడికి హామీ ఇచ్చింది.
 
ఇక ప్రణాళిక ప్రకారం శ్రీనుకి పార్టీ చేసుకుందాం రమ్మంటూ మలిశెట్టి మోహన్ వెంటబెట్టుకుని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ శ్రీను చేత పూటుగా మద్యం తాగించి ఆ తర్వాత మద్యం బాటిల్ పగులగొట్టి పొడిచి చంపేసాడు. విషయాన్ని లతకు చెప్పాడు. భర్త హత్య తనకు ఎక్కడ చుట్టుకుంటుందోనని, ముందుగానే పోలీసు స్టేషనుకు వెళ్లి తన భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసింది. పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపి తీగ లాగడంతో డొంక కదిలింది. వాస్తవం బైటపడింది. దీనితో లత, మల్లీశం, మోహన్‌లను పోలీసులు అరెస్ట్ చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments