భర్త మొబైల్ ఫోన్ ఇవ్వలేదని భార్య ఆత్మహత్య

ఠాగూర్
సోమవారం, 18 ఆగస్టు 2025 (09:59 IST)
భర్త మొబైల్ ఫోన్ ఇవ్వలేదన్న మనస్తాపంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం యాకర్లకుంటపల్లిలో ఈ ఘన చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.... మహారాష్ట్రకు చెందిన సుధీర్ కట్కర్‌కు నీమా కట్కర్ (18) అనే యువతితో ఆరు నెలల క్రితం వివాహమైంది. ఆ తర్వాత ఈ దంపతులు బొగ్గులు కాల్చే పని కోసం ముదిగుబ్బకు వలస వచ్చారు. 
 
ఆదివారం సాయంత్రం భర్త సుధీర్ గట్కర్‌ను మొబైల్ ఫోన్ ఇవ్వాలని భార్య కోరింది. అయితే, సెల్‌లో చార్జింగ్ లేదంటూ మొబైల్ ఫోన్ ఇవ్వకుండా భార్యతో వాగ్వాదం చేసి బయటకు వెళ్లిపోయాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన నీమా తాము నివసించే గుడిసె సమీపంలో చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments