ఇటీవల ఇంటి నుంచి తప్పిపోయిన అక్కా చెల్లెళ్లు ఇపుడు అనుకోని విధంగా దంపతులుగా ఇంటికి తిరిగి వచ్చారు. పైగా, తాము ఇక నుంచి భార్యాభర్తలుగా జీవించాలని అనుకుంటున్నామని చెప్పేసరికి పోలీసులు, కుటుంబ సభ్యులు నిర్ఘాంతపోయారు. ఈ విచిత్ర సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్‌లో వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
ఇటీవల ఓ యువతి నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు, కుటుంబ సభ్యులంతా కలిసి ఆమె కోసం గాలించసాగారు. ఈ క్రమంలో ఆ యువతి తన సోదరి వరుసైన మరో యువతిని వివాహం చేసుకుని, ఇక నుంచి తాము దంపతులుగా జీవించాలని అనుకుంటున్నట్టు చెప్పడంతో తల్లిదండ్రులతో పాటు పోలీసులు సైతం నిర్ఘాంతపోయారు.
తాను వరుడుగా మారి తన చెల్లిని వివాహం చేసుకున్నట్టు సదరు యువతి పోలీసులకు చెప్పింది. యేడాదిగా తాము ప్రేమించుకుంటున్నామని కుటుంబ సభ్యులకు తమ ప్రేమను వ్యతిరేకించడంతో పారిపోయి వివాహం చేసుకున్నట్టు చెప్పారు. ఇంటికి తిరిగి వెళ్లాలని వారిని ఒప్పించడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇరువురూ తమ మనసు మార్చుకోవడానికి నిరాకరించారు.