ఆపరేషన్ థియేటర్లో కళ్లు తెరిచి చూసేసరికి నేను అమ్మాయిగా మారిపోయా

ఐవీఆర్
గురువారం, 20 జూన్ 2024 (16:45 IST)
తన తోటి స్నేహితుడుపై వున్న అమితమైన ప్రేమ అతడిని దారుణం చేసేందుకు ప్రోత్సహించింది. ఉన్మాదిగా మారిన సదరు యువకుడు తన స్నేహితుడి జీవితాన్ని సర్వనాశనం చేసాడు. ఆపరేషన్ థియేటర్‌కి తీసుకుని వెళ్లి స్నేహితుడిని కాస్తా స్నేహితురాలిగా మార్చేసాడు. ఈ దారుణం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ముజఫర్ నగర్‌కు చెందిన ఓంప్రకాశ్ అనే వ్యక్తి 20 ఏళ్ల యువకుడితో స్నేహం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఓరోజు సదరు యువకుడు తనకు అనారోగ్యంగా వుందని చెప్పడంతో ఆసుపత్రికి వెళ్దాం పద అని తీసుకెళ్లాడు. అక్కడ వైద్యులు... చిన్నపాటి శస్త్రచికిత్స చేయాలని ఆ యువకుడితో చెప్పారు. అది నిజమని నమ్మిన యువకుడు అందుకు సమ్మతించాడు. అంతే.. అతడికి మత్తు మందు ఇచ్చి అతడికి లింగమార్పిడి శస్త్ర చికిత్స చేసేసారు. పురుషుడిగా వున్న అతడిని స్త్రీగా మార్చేసారు.
 
ఆపరేషన్ పూర్తయ్యాక మత్తు వదిలి సదరు యువకుడు కళ్లు తెరిచి చూసి తనకు లింగమార్పిడి చేసారని గమనించాడు. పక్కనే వున్న ఓంప్రకాష్.. ఇదంతా నీకోసమే చేసాననీ, మనిద్దరం పెళ్లి చేసుకుని హాయిగా వుండొచ్చని చెప్పాడు. విషయాన్ని ఎవరికైనా చెబితే బాధిత యువకుడి తల్లిదండ్రులను హతమారుస్తానని బెదిరించాడు. ఐతే ఎలాగో ధైర్యం తెచ్చుకున్న యువకుడు విషయాన్ని తన పేరెంట్స్ తో కలిసి ఈ నెల 16న పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దీంతో నిందితుడు ఓంప్రకాష్‌ను పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

తర్వాతి కథనం
Show comments