Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య నిద్రపోగానే కుమార్తెపై అత్యాచారం.. ఏడాదిన్నరగా ఫిజియోథెరపిస్టు అరాచకం

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (13:44 IST)
విజయవాడ నగరంలో ఓ దారుణం వెలుగుచూసింది. భార్య నిద్రపోయిన తర్వాత లేదా భార్య ఇంట్లో లేనపుడు కుమార్తెపై కన్నతండ్రి లైంగికదాడికి పాల్పడుతూ వచ్చాడు. ఈ దారుణం గత యేడాదిన్నరగా సాగుతూ వస్తోంది. కన్నతండ్రి లైంగికదాడిని భరించలేని ఆ బాలిక... తన అమ్మమ్మ ఇంటికి వెళతానని మొండిపట్టుపట్టింది. దీంతో ఏం జరిగిందని తల్లి నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణానికి పాల్పడిన కన్నతండ్రి స్థానికంగా ఓ ఫిజియోథెరపిస్టుగా పని చేస్తున్నాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, విజయవాడ, అజిత్‌ సింగ్‌ నగర్‌‌లో నివాసముంటున్న ఫిజియోథెరపిస్టు (35)కు కుమార్తె (13), కుమారుడు (11) ఉన్నారు. కుమార్తె ఓ ప్రైవేట్ పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. గత ఏడాది మార్చి నెల నుంచి కూతురిపై తండ్రి లైంగిక దాడికి పాల్పడుతూ వచ్చాడు. 
 
భార్య నిద్రపోయిన తర్వాత పక్కనే పడుకున్న కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. భార్య ఇంట్లో లేనప్పుడల్లా కుమార్తెపై అత్యాచారం చేయసాగాడు. ఈ నెల 8, 10వ తేదీల్లోనూ కూతురిపై అత్యాచారం చేయడంతో బాలిక భరించలేకపోయింది. తాను ఇక్కడ ఉండలేనని అమ్మమ్మ ఇంటికి వెళ్లిపోతానని తల్లికి చెప్పింది. 
 
దీంతో ఏం జరిగిందని తల్లి నిలదీయడంతో జరిగిన విషయం చెప్పి బోరున విలపించింది. ఆ తర్వాత వారిద్దరూ కలిసిన అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక నివాస ప్రాంతాన్ని విజయవాడ నార్త్‌ జోన్‌ ఎసిపి షేక్‌ షాను, సిఐ లక్ష్మీనారాయణ పరిశీలించారు. పోక్సో యాక్టు ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం