Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేనల్లుడు లైంగికంగా వేధిస్తున్నాడన్న మహిళ... శిరోమండనం చేసి చావబాదిన భర్త!!

ఠాగూర్
శనివారం, 7 సెప్టెంబరు 2024 (11:50 IST)
మేనల్లుడు తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ కట్టుకున్న భర్తకు ఓ భార్య చెప్పింది. తన మేనల్లుడి గురించి భార్య ఇలా చెప్పడాన్ని జీర్ణించుకోలేని భర్త.. ఆమెను చావబాదాడు. శిరోమండనం చేశాడు. తాను మాత్రమే కాకుండా, తన కుటుంబీకులతో కూడా కొట్టించాడు. ఈ విషయం పోలీసుల దృష్టికి చేరడంతో రంగ ప్రవేశం చేసి ఈ దారుణానికి పాల్పడిన భర్తతో సహా మొత్తం ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కన్నౌజ్‌లో చోటుచేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తనను మేనల్లుడు లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఓ మహిళ భార్యకు చెప్పింది. దీంతో ఆమెపై విచక్షణ రహితంగా దాడిచేసి శిరోముండనం చేశారు. ఈ నెల 3న ఈ ఘటన జరిగినప్పటికీ వీడియో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళకు గుండు గీసి, కాళ్లుచేతులు కట్టేయడం వీడియోలో కనిపించింది. గుమికూడిన జనం ముందే భర్త ఆమెను కర్రతో చావబాదాడు. బాధతో విలవిల్లాడుతున్న ఆమెపై నిందితులు వంతుల వారీగా దాడిచేశారు.
 
మేనల్లుడు రాజనాథ కొంతకాలంగా తనను లైంగికంగా వేధిస్తున్నాడని బాధిత మహిళ ఆరోపించింది. ఈ విషయం చెప్పినందుకు భర్త, ఆయన కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఊగిపోతూ శిరోముండనం చేయించి కర్రలతో చావగొట్టారు. వీడియో పోలీసులకు చేరడంతో వారు వెంటనే స్పందించారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిని అరెస్ట్ చేశామని, తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

పుష్ప-2 వైల్డ్ ఫైర్ కోసం వేచి వుండలేకపోతున్నా బన్నీ.. శిల్పా రవి (video)

చిరంజీవికి, చెర్రీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నయనతార.. ఎందుకు?

మోహన్ బాబుకు ఏడాదిపాటు 50 ఏళ్ల వేడుకలు చేయనున్న మంచు విష్ణు

బాబు - లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలు : రాంగోపాల్ వర్మపై మరో కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం