Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు 70 యేళ్లు - 70 అడుగులతో విఘ్నేశ్వరుడు

ఠాగూర్
శనివారం, 7 సెప్టెంబరు 2024 (10:55 IST)
హైదరాబాద్ నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే గణేష్ ఉత్సవాల్లో భాగంగా, ఖైరతాబాద్ వినాయకుడు కొలువుదీరాడు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు ప్రారంభమై 70 యేళ్ళు ప్రారంభమైన శుభసందర్భాన్ని పురస్కరించుకుని ఈ దఫా ఖైరతాబాద్‌లో 70 అడుగులు ఎత్తుండేలా విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఈ విగ్రహానికి తొలి పూజ శనివారం ఉదయం 11 గంటలకు జరిగింది. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొని, గణేశ్ మహారాజ్‌కు తొలి పూజ చేశారు. మధ్యాహ్నం రాష్ట్ర గవర్మర్ జిష్ణుదేవ్ వర్మ పూజ చేయనున్నారు. 
 
కాగా ఆనవాయితీ ప్రకారం ఒగ్గుడోలు, బోనాలెత్తుకున్న మహిళలతో పద్మశాలీ సంఘీయులు ఊరేగింపుగా మండపం వద్దకు చేరుకుని గణనాథునికి చేనేత నూలు కండువా, గాయత్రి సమర్పించారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు ప్రారంభమై 70 యేళ్లు అయిన సందర్భంగా 70 అడుగులు ఎత్తులో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 7 అంకెకు ప్రాధాన్యమిస్తూ 7 తలలు, 7 సర్పారు, రెండు వైపులా 7 చొప్పున మొత్తం 14 చేతులతో ఇక్కడి విఘ్నేశ్వరుడు కొలువుదీరాడు. 
 
ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ 28 అడుగుల వెడల్పుతో విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు. పది రోజుల పాటు మహా గణపతి భక్తుల పూజలు అందుకోనున్నారు. ఈ నెల 17వ తేదీన నిమజ్జన వేడుక అత్యంత వైభవోపేతంగా, ఘనంగా నిర్వహించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్దల మాట, పోలీస్ వారి హెచ్చరిక మన మంచికే : ట్రైలర్ లో వక్తలు

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments