Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలా చేస్తూ మూడో భర్తకు చిక్కింది, గాలిస్తున్న పోలీసులు

Webdunia
బుధవారం, 1 సెప్టెంబరు 2021 (22:05 IST)
విశాఖలో నిత్య పెళ్ళి కూతురి బాగోతం బయటపడింది. పెళ్ళి చేసుకోవడం.. భర్తను మోసం చేయడం.. పారిపోవడం.. తప్పించుకు తిరుగుతూ మరొక పెళ్ళి చేసుకోవడం.. ఇలా నాలుగు పెళ్లిళ్ళు చేసుకుని కోట్ల రూపాయలు సంపాదించి తప్పించుకు తిరుగుతున్న నిత్యపెళ్ళి కూతురు కోసం పోలీసులు గాలిస్తున్నారు.
 
వైజాగ్‌కు చెందిన యమున అనే యువతి బాగోతాన్ని బయటపెట్టాడు మూడో పెళ్ళికొడుకు ప్రసాద్. గాజువాకకు చెందిన ప్రసాద్ లక్నోలో నివసిస్తున్నాడు. బంధువులు చూసిన యమునను సంవత్సరం క్రితం వివాహం చేసుకున్నాడు. ఆమెను లక్నోకు తీసుకెళ్ళాడు. 
 
లక్నోలో భర్తతో బాగానే ఉన్న ఆమె ఆ తరువాత మెల్లగా నగలును కొనిచ్చికోవడం మొదలుపెట్టింది. సుమారు 90 లక్షల రూపాయల విలువ చేసే నగలును కొనుగోలు చేయించింది. ఆ తరువాత ఇంట్లో వారు ఇబ్బందుల్లో ఉన్నారని 15 లక్షల దాకా కావాలని తీసుకుంది.
 
ఇంటికి వెళ్ళొస్తానని చెప్పి వైజాగ్‌కు వచ్చిన యమున ఆ తరువాత కనిపించకుండా పోయింది. నెల రోజులవుతున్నా ఫోన్ పనిచేయకపోవడంతో ఆందోళనకు గురైన ప్రసాద్ వైజాగ్ వచ్చాడు. యమున నివాసమున్న ప్రాంతానికి వెళ్ళాడు. 
 
అయితే ఆ ప్రాంతంలో లేదు. యమునకు గతంలోనే వివాహాలు జరిగాయని అక్కడి వారు చెప్పడంతో ప్రసాద్ పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించాడు. భార్యపై ఫిర్యాదు చేశాడు. ప్రసాద్ ఫిర్యాదు తరువాత రెండవ భర్త, మొదటి భర్త కూడా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం యమున పరారీలో ఉంది. పోలీసులు యమున కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

యుద్దం రేపటి వెలుగు కోసం అనేది త్రికాల ట్రైలర్

మహిళా సాధికారతపై తీసిన నేనెక్కడున్నా ట్రైలర్ విడుదల చేసిన ఈటల రాజేందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments