Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలక్ బాబా నాకు మత్తు మందు తినిపించి అత్యాచారానికి పాల్పడ్డాడు: యువతి ఆరోపణ

ఐవీఆర్
ఆదివారం, 20 అక్టోబరు 2024 (19:59 IST)
బాలక్ బాబా నాకు మత్తు మందు తినిపించి అత్యాచారానికి పాల్పడ్డాడు అంటూ ఓ యువతి సంచలన ఆరోపణలు చేసింది. జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన సికార్‌లోని లక్ష్మణ్‌ఘర్‌లోని ఖేడీ దతుంజలాలోని క్షేత్రపాల్ ఆలయానికి చెందిన పూజారి బాబా బాలక్‌నాథ్‌. ఇతడిపై అత్యాచారం కేసు నమోదైంది. బాబా బాలక్ నాథ్, అతని కారు డ్రైవరుతో సహా ముగ్గురు నిందితులపై సికర్ ఉద్యోగ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తనకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపించింది. విషయం బయటకు చెబితే బాబా తనను చంపేస్తానని బెదిరించాడని బాధితురాలు ఆరోపించింది. 6 నెలల క్రితం జరిగిన ఈ ఘటన వీడియో వైరల్ కావడంతో బాధితురాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
 
లక్ష్మణ్‌ఘర్‌లోని ఖేడీ దతుంజలాలోని క్షేత్రపాల్ ఆలయ పూజారి బాబా బాలక్‌నాథ్‌పై ఈ కేసు నమోదైంది. తంత్ర విద్య నేర్పిస్తానని చెప్పి ఆ నెపంతో బాబా తనకు మత్తు మందు తినిపించి అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు చెప్పింది.
 
తంత్ర విద్య ద్వారా కుటుంబ సమస్యలను పరిష్కరిస్తానంటూ బాబా మోసం చేసారని బాధితురాలు ఆరోపించింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... ఆమె కొన్ని నెలల క్రితం పూజల కోసం గుడికి వెళ్లింది బాధితురాలు. అక్కడ రాజేష్ అనే వ్యక్తి ఆ అమ్మాయిని బాబాకు పరిచయం చేశాడు. ఆలయానికి చెందిన బాబా బాలక్‌నాథ్ తంత్ర విద్య ద్వారా కుటుంబ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
 
ఆ తర్వాత కొన్నిరోజులకు తను గుడికి వెళ్లగా బాబా ప్రసాదం ఇచ్చి, ఈ ప్రసాదంతో నీకు దీవెనలు లభిస్తాయని చెప్పారు. సుమారు 6 నెలల క్రితం మా సమస్యలు తీరేందుకు మరో ఆలయానికి వెళ్లాలంటూ ఆటోలో తనను తీసుకెళ్లినట్లు బాధితురాలు చెప్పింది. ఈ క్రమంలో తనకు ప్రసాదం తినమని ఇచ్చాడు. అది తినగానే ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. ఆ తర్వాత బాబా ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఆమెపై అతడు మూడుసార్లు అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఆరోపించింది. ఈ ఘటనను కారు డ్రైవర్ యోగేష్ వీడియో తీశాడు.
 
వీడియోను వైరల్ చేస్తానని నిందితులు బెదిరిస్తూ ఫోన్‌లు చేయడం ప్రారంభించారు. విషయం బయటకు రాకుండా వుండాలంటే తాము పిలిచినప్పుడల్లా రావాలని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు. చెప్పిన మాట వినకపోతే వీడియోను వైరల్ చేస్తానని బెదిరించడం కూడా మొదలుపెట్టారు. ఈ వీడియో వైరల్ కావడంతో, బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

Chiru: మన శంకరవరప్రసాద్ గారు ముచ్చటగా మూడవ షెడ్యూల్ ని కేరళలో పూర్తి

Vijay Antony: భద్రకాళి కొత్త పొలిటికల్ జానర్ మూవీ : విజయ్ ఆంటోనీ

వై.ఎస్. గురించి మీకు ముందే తెలుసా ! అని అడిగారు : దర్శకుడు శశికిరణ్‌ తిక్క

ఓ రేంజ్‌లో సాగుతున్న 'వీరమల్లు' రికార్డులు... పాత రికార్డులు గల్లంతేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments