బాలికతో స్నేహం.. బెదిరించి న్యూడ్ వీడియోలు తీసి ఫ్రెండ్స్‌కు షేరింగ్...

ఠాగూర్
సోమవారం, 23 జూన్ 2025 (14:12 IST)
తెలంగాణా రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో జరిగిన ఓ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. స్నేహం పేరుతో 16 యేళ్ల బాలికతో పరిచయం పెంచుకున్న 16 యేళ్ళ బాలుడు.. ఆ బాలికను బెదిరించి న్యూడ్‌గా వీడియోలు తీశాడు. ఆ వీడియోలను తన స్నేహితులకు పంపించాడు. ఈ వీడియోలు స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో ఈ దుశ్చర్య వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఇద్దరు మైనర్లతో సహా ఆరుగురిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 
 
స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు...మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికకు సామాజిక మాధ్యమం ద్వారా ఓ బాలుడు దగ్గరయ్యాడు. నగ్నంగా వీడియో కాల్ చేయాలని, లేదంటే తనతో చేసిన చాటింగ్‌ను తల్లిదండ్రులకు చూపిస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో భయపడిపోయిన ఆ బాలిక దుస్తులిప్పేసి వీడియో కాల్ చేసింది. ఈ వీడియోను మైనర్ బాలుడు రికార్డు చేసి తన స్నేహితులకు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశాడు. 
 
ఆ తర్వాత ఆ బాలికను పలుమార్లు మానసికంగా, శారీరకంగా వేధించసాగాడు. అదేసమయంలో ఈ వీడియోలు వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన షీటీం బృందం సహాయంతో గుడిహత్నూర్, ఇచ్చోడ పోలీసుసలు బాలుడు (16), వంశీకృష్ణ (20), పవర్ తరుణ్ (18), బాలవంత్ సింగ్ (18), గుండల్వార్ వరుణ్ (18), కారడ్ సుధీర్ (28), ముర్కుటే విఠల్ (23)లను అరెస్టు చేశారు. వీరిని న్యాయమూర్తి ముందు హాజరుపరచగా ఇద్దరు బాలురను నిజామాబాద్ జువైనల్ హోంకు, మిగిలినవారిని జైలుకు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments