Publish Date: Mon, 23 Jun 2025 (10:50 IST)
Updated Date: Mon, 23 Jun 2025 (10:51 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతి మహిళలు వేశ్యలంటూ చేసిన మురికి వ్యాఖ్యల కేసులో అరెస్టయిన జర్నలిస్టు కృష్ణంరాజు పశ్చాత్తాపం చెందుతున్నారు. అమరావతి మహిళలందరికీ క్షమాపణలు చెబుతానని పోలీసుల వద్ద ప్రాధేయపడుతున్నాడు. మహిళలను ఉద్దేశించి కించపరిచేలా చేసిన వ్యాఖ్యలకుగాను ఆయనపై కేసు నమోదైంది. దీంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టు అనుమతితో పోలీసులు కష్టడీకి తీసుకుని విచారించారు.
శుక్రవారం కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. మూడు రోజుల పాటు విచారణ జరిపారు. ఈ విచారణ ముగియడంతో మంగళగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు చేసి మళ్లీ గుంటూరులోని జిల్లా జైలుకు తరలించారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. అమరావతి మహిళలకు సారీ చెబుతానంటూ పోలీసుల వద్ద ప్రాధేయపడినట్టు సమాచారం.