Publish Date: Sun, 22 Jun 2025 (09:36 IST)
Updated Date: Sun, 22 Jun 2025 (09:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కోస్తా, యానాంలో ఈ రోజు, రేపు అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
గత 24 గంటల వ్యవధిలో శ్రీశైలంలో గరిష్టంగా 40 మిల్లీమీటర్లు, రాజమండ్రిలో 30 మిమీ, చిత్తూరులో 19 మిమీ, అమలాపురంలో 18 మిమీ, కాకినాడలో 13 మిమీ, యానాం, నెల్లూరుల్లో 6.6 మిమీ, తణుకులో 4.8 మిమీ, బాపట్లలో 4.3 మిమీ, కావలిలో 4 మీమీ చొప్పున వర్షపాతం నమోదైంది.