Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమెకు 28.. అతడికి 20.. బండరాయితో మోది చంపేశారు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 1 మే 2023 (09:37 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్‌ జిల్లాలో ఓ జంట దారుణ హత్యకు గురైంది. ఇది స్థానికంగా కలకలం సృష్టించింది. ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చిన ఈ జంట హత్య కేసు వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని గుడిహత్నూర్‌ మండలంలోని సీతాగోంది శివారులో రెండు మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అవి ఆదిలాబాద్‌ పట్టణం భుక్తాపూర్‌కు చెందిన రెహమాన్‌(20), కేఆర్‌కే నగర్‌కు చెందిన అశ్విని(28)గా గుర్తించారు. అశ్వినికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిసింది. కొన్ని నెలలుగా భర్తతో విడిపోయి పుట్టింట్లో ఉంటుంది. 
 
ఈ క్రమంలో ఆమెకు రెహమాన్‌తో వివాహేతర సంబంధం ఉండడం వల్లే ఈ హత్యలు జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. వీరిద్దరూ శుక్రవారం ఆదిలాబాద్‌ నుంచి సీతాగోందిలో స్థానిక పంట పొలంలోకి ద్విచక్రవాహనంపై వెళ్తున్న సీసీ ఫుటేజీని పోలీసులు సేకరించారు. వారు మృతదేహాలను పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. వారిద్దరి తలలపై బండరాళ్లతో మోది కిరాతకంగా హత్య చేసినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. 
 
ఈ హత్యలు అశ్విని భర్త తరపు వాళ్లే చేసి ఉంటారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. శవ పరీక్ష కోసం మృతదేహాలను రిమ్స్‌కు తరలించారు. ప్రాథమిక విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ నాగేందర్‌ తెలిపారు. ఘటన స్థలాన్ని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి సందర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments