Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణా సచివాలయంలో ప్రారంభమైన చండీయాగం

telangana secretariat
, ఆదివారం, 30 ఏప్రియల్ 2023 (11:17 IST)
తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు ఆదివారం ఉదయం ఆరు గంటలకే ప్రారంభమయ్యాయి. ఇందులోభాగంగా, చండీయాగాన్ని వేదపండితులు ప్రారంభించారు. ఈ యాగంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రంలో 110 మంది వేద పండితులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 1.20 గంటలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సచివాలయాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత 1.56 నుంచి 2.04 గంటల మధ్య మంత్రులు, అధికారులు ఒకేసారి తమ సీట్లలో ఆశీనులవుతారు. 2.15 గంటలకు బహిరంగసభలో కేసీఆర్ ప్రసంగిస్తారు. 
 
నూతన సచివాయలయంలో ఈ తెల్లవారుజామున 5.50 గంటలకు పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 6.15 గంటలకు ప్రారంభమైన చండీయాగం, సుదర్శన యాగాల్లో మంత్రి ప్రశాంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఆ తర్వాత వాస్తు పూజలోనూ వారు పాల్గొంటారు. హోమం, యాగ నిర్వహణ సచివాలయంలో వివిధ చాంబర్లలో ప్రారంభోత్సవంలో కార్యక్రమాల్లో 110 మంది వేద పండితులు, రుత్విక్కులు పాల్గొంటారు. శృంగేరీ పీఠానికి చెందిన గోపీకృష్ణ శర్మ, ఫణిశశాంక శర్మ, వాస్తు పండితుడు సుద్దాల సుధాకర తేజా ఈ కార్యక్రమాలకు నిర్వహిస్తున్నారు. 
 
నూతన సచివాలయంలోని ఆరో అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయంగా ఉండగా, మూడో అంతస్తులో మంత్రి కేటీఆర్ కార్యాలయం ఉంది. రెండో అంతస్తులో మరో మంత్రి హరీష్ రావు కార్యాలయం ఉంది. కేసీఆర్ తన సీటులో ఆసీనులు కాగానే పోడుపట్టాల మార్గదర్శకాలపై తొలి సంతకం చేయనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మే సేవలు చాలు.. ఇక దయచేయండి.. సచివాలయానికి తాళం