Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మే సేవలు చాలు.. ఇక దయచేయండి.. సచివాలయానికి తాళం

village secretariat
, ఆదివారం, 30 ఏప్రియల్ 2023 (10:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం వ్యవస్థను అమలు చేస్తుంది. ప్రతి ఒక్క సేవను ప్రభుత్వం అందిస్తుంది. అయితే, పలు ప్రాంతాల్లో ఈ సచివాలయకు ఇబ్బందులు తప్పడం లేదు. మీ సేవలు చాలు.. ఇక దయచేయండి అంటూ సచివాలయానికి తాళం వేశారు. 
 
కర్నూలు జిల్లా ఆస్పరి మండలం డి.కోటకొండ పంచాయతీ పరిధిలో బైలుపత్తికొండ, గార్లపెంట మజరా గ్రామాలు ఉన్నాయి. డి.కోటకొండ గ్రామంలో మూడు వేలకు పైనే జనాభా ఉన్నారు. ప్రధాన కాలనీల్లో వర్షం నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేదు. వీధులు కాలువలను తలపిస్తున్నాయి. 
 
శనివారం గ్రామస్థులు బాషా, బడేసాబ్‌, రాజాసాహెబ్‌, మల్లన్న, వీరేష్‌, రంగన్న, హనుమంతు, రత్నమ్మ, సారమ్మ, మలేశ్వరమ్మతో పాటు పిల్లలు, పెద్దలు అందరూ కలసి మూకుమ్మడిగా సచివాలయం వద్దకు వెళ్లి కార్యాలయానికి తాళం వేసి ఎదుట ధర్నా చేపట్టారు. 
 
వర్షం నీరు కాలనీల్లో నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మండల అధికారులకు చరవాణి ద్వారా సమాచారం అందించారు. సాయంత్రం వరకు మండల అధికారులు రాలేదు. సమస్య పరిష్కరించే వరకు గ్రామ సచివాలయం తెరవనివ్వమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యాదాద్రిలో నిత్యకల్యాణం నిలిపివేత.. ఎందుకో తెలుసా?