తొలి చిత్రం 'రౌడీ బాయ్స్'తో ఆకట్టుకున్న యంగ్ హీరో ఆశిష్ రెడ్డి, నూతన దర్శకుడు కాశీ విశాల్ దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్ , ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ ల శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తున్న యూత్ ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ సెల్ఫిష్ తో వస్తున్నాడు.
ఆశిష్ మాస్ క్యారెక్టర్‌లో నటిస్తున్నాడు. ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో తన నిర్లక్ష్య వైఖరిని చూపించడం గమనించవచ్చు. మిక్కీ జె మేయర్ స్వరపరిచిన దిల్ ఖుష్ పాటను మే 1వ తేదీన ఆశిష్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నారు. పోస్టర్‌లో ఫ్యాషన్, స్పోర్టింగ్ షేడ్స్‌లో కనిపిస్తున్నాడు. ఇందులో ఆశిష్ సెల్ఫిష్ ఓల్డ్ సిటీ వ్యక్తిగా కనిపిస్తాడు. అతను జీవితంలోని తీపిని మాత్రమే కోరుకుంటాడు.
ఈ చిత్రంలో ఆశిష్ సరసన ఇవానా కథానాయిక గా నటిస్తోంది. హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, అశోక్ బండ్రెడ్డి ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, ఎస్ మణికంధన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి చంద్రబోస్ లిరిక్ రైటర్. ప్రవీణ్ పూడి ఎడిటర్, కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్.
సెల్ఫిష్ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.