Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను వదిలేసి ప్రియుడితో వచ్చేసింది, అది నచ్చక ఆత్మహత్య చేసుకున్నారు

Webdunia
సోమవారం, 24 జనవరి 2022 (23:22 IST)
పెళ్లయి ఆరేళ్లయ్యింది పిల్లలు లేరు. వైద్యుడి దగ్గరకు వెళితే నీ భర్తకు లోపం ఉందని భార్యకు చెప్పారు. దీంతో ఆమెకు కోపం వచ్చింది. సంసారానికి పనికిరాని భర్తతో ఇక జీవించకూడదనుకుంది. ఇంటి పక్కనే అప్పటికే పరిచయం ఉన్న ట్యాక్సీ డ్రైవర్‌తో ఇంటి నుంచి వెళ్ళిపోయింది. వెళుతూ వెళుతూ భర్తకే వెళ్ళిపోతున్నానంటూ చెప్పి మరీ వెళ్ళింది.

 
శారీరక సుఖం ఎన్నో జీవితాలను నాశనం చేస్తోంది. బెంగుళూరులోని కొడిగెనహళ్ళిలో నివాసముంటున్నారు రాము, జ్యోతి. ఆరేళ్ళ క్రితమే వివాహమైంది. అయితే పిల్లలు లేరు. మొదట్లో రెండు సంవత్సరాల వరకు పిల్లలు వద్దని భర్త భార్యకు చెప్పాడు. ఆ తరువాత పిల్లలు కావాలని భార్య ఒత్తిడి చేసినా పిల్లలు మాత్రం పుట్టలేదు.

 
సంవత్సరం క్రితమే భర్త సంసారానికి పనికిరాకపోవడంతో పిల్లలు పుట్టడం లేదన్న విషయం తెలిసింది జ్యోతి. దీంతో ఇద్దరి మధ్యా తరచూ గొడవ జరిగేది. ఒక అనాథను తీసుకొచ్చి పెంచుకుందామని జ్యోతి చెప్పినా వినిపించుకునే వాడు కాదు రాము. 

 
ఈ క్రమంలోనే తన ఇంటికి పక్కనే ట్యాక్సీ డ్రైవర్ రాజు అనే వ్యక్తితో పరిచయం పెంచుకుంది జ్యోతి. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. వారంరోజుల క్రితం భర్తకు స్వయంగా తాను ఇంటి నుంచి ప్రియుడితో వెళ్ళిపోతానని చెప్పి మరీ వెళ్ళింది జ్యోతి. దీంతో రాము కూడా పట్టించుకోలేదు. 

 
ఇంటి నుంచి పారిపోయిన ఇద్దరూ దేవనహళ్ళి సమీపంలో ఇంటిని అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. అయితే ఈరోజు ఉదయం ఇద్దరూ శవమై కనిపించారు. తగాదాలతో ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇంటి నుంచి వచ్చేయడం రాజుకు ఏ మాత్రం ఇష్టం లేదని.. జ్యోతి ఒత్తిడి తేవడంతోనే చేసేది లేక బయటకు వచ్చి చివరకు ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

గగన మార్గన్‌ లో ప్రతినాయకుడిగా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధిషన్‌

ఆయన వల్లే బాలక్రిష్ణ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్ కు ఛాన్స్ వచ్చిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తర్వాతి కథనం
Show comments