Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సప్ సందేశాలు పంపుతూ వల, ఇతర రాష్ట్రాల నుంచి యువతులు...

Webdunia
బుధవారం, 11 ఆగస్టు 2021 (19:44 IST)
ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి నగరంలో అసాంఘిక కార్యకలాపాలతో కొంతమంది అపవిత్రం చేస్తున్నారు. పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు. ఎప్పుడో ఒకసారి తూతూమంత్రంగా దాడులు నిర్వహించి ఆ తరువాత సరిపెట్టేస్తున్నారన్న విమర్సలు లేకపోలేదు.
 
తాజాగా తిరుపతిలోని అలిపిరి పోలీసు స్టేషన్‌కు సమీపంలో వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. కేవలం వాట్సాప్ లోనే అందమైన యువతుల ఫోటోలను పంపించి రేటు మాట్లాడి ఆ తరువాత ఈ వ్యాపారాన్ని చేసే ముఠాలోని కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 
 
గత కొన్నినెలలుగా జ్యోతి అనే ఒక మహిళ పశ్చిమబెంగాల్, మహారాష్ట్రల నుంచి యువతులను తీసుకొచ్చి వారితో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తేలింది. అది కూడా అలిపిరి పోలీసు స్టేషన్‌కు అతి సమీపంలోనే ఈ వ్యవహారం నడుస్తుంది. కానీ గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న ఈ వ్యవహారం కాస్త ఒక్కసారిగా బయటకు వచ్చింది.
 
ఐదుగురు యువతులను, ఇద్దరు విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందే నిర్వాహకురాలు జ్యోతిని పట్టుకున్నారు పోలీసులు. నిందితులను కోర్టుకు తరలించగా యువతులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments