Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బెంగ‌ళూరు, గుడివాడ‌ల నుంచి యువ‌తుల‌ను ర‌ప్పించి...

Advertiesment
బెంగ‌ళూరు, గుడివాడ‌ల నుంచి యువ‌తుల‌ను ర‌ప్పించి...
, బుధవారం, 21 జులై 2021 (12:30 IST)
తిరుపతిలో హైటెక్ వ్యభిచారంలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఈ హైటెక్ వ్య‌భిచారంలో అంతా స్మార్ట్ ఫోన్ల ద్వారానే దందా సాగిపోతున్న‌ట్లు తేలింది. బేరాలన్నీ వాట్సాప్లో సాగిస్తూ, అమ్మాయిలు, వారి ఐ.డి.లే క‌నెక్టింగ్ కి వాడుకుంటున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. 
 
ఆంధ్రప్రదేశ్ లోని ఆధ్యాత్మిక నగరం తిరుపతి పట్టణంలో గుట్టుగా సాగుతున్న హైటెక్ వ్యభిచార దందాను పోలీసులు రట్టు చేసిన సంగ‌తి విదిత‌మే, అయితే తిరుపతి శ్రీనగర్ కాలనీలో రహస్యంగా కొనసాగుతున్న వ్యభిచార దందాలో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. వాట్సాప్ ద్వారా
విటులను ఆకర్షించి, జోరుగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.

ఓ ఇంట్లో ఆక‌స్మికంగా దాడి చేసి నలుగురు విటులు, నిర్వాహకులను అరెస్టు చేసినట్లు తిరుపతి పోలీసులు వెల్లడించారు. పోలీసుల విచారణలో  నిజాలు బయటకు వచ్చాయి. ఈ వ్యభిచార దందా నిర్వహిస్తోంది ఇద్దరు మహిళలని తేలింది. ఈ దందా నిర్వహిస్తోంది కర్ణాటక రాష్ట్రం, బళ్లారికి చెందిన స్వప్న, లక్ష్మి ప్రియగా గుర్తించినట్లు సీఐ శివప్రసాద్ రెడ్డి తెలిపారు. యువతుల ఫొటోలను సాయిచరణ్, అనిరుధ్ కుమార్ లు విటులకు పంపుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

బెంగుళూరు, గుడివాడ నుంచి యువతులను రప్పించి.. జీవకోన శ్రీనగర్ కాలనీకి చెందిన సాయిచరణ్, అనిరుధ్ ద్వారా లక్ష్మిప్రియ, స్వప్నలు వ్యభిచారం నిర్వహిస్తుండగా దాడి చేసి పట్టుకున్నామని సీఐ తెలిపారు. వీరి నుంచి కొంతమంది యువతులను రక్షించినట్లు ఆయన పేర్కొన్నారు. దీనితో సంబంధమున్న నలుగురిపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. ఇద్దరు నిర్వాహకులను అరెస్ట్ చేసినట్లు సీఐ శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఇంకెవ‌రికి సంబంధం ఉంద‌నే అంశంపై, ఇంకా లోతుగా విచారణ చేపట్టినట్లు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రన్నింగ్‌లో ఊడిపోయిన ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు... ఎక్కడ?