దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

ఠాగూర్
ఆదివారం, 16 ఫిబ్రవరి 2025 (18:40 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డిలో ఓ దారుణం జరిగింది. దేవుడు మొక్కు తీర్చుకుని ఇంటికి వస్తున్న ఓ దంపతుల జంటపై కామాంధుడు పగబట్టాడు. భర్తను కొట్టి, ఆయన కళ్లముందే భార్యపై అత్యాచారానికి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి సంగారెడ్డి జిల్లా ఫసల్ వాదిలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలోని ఓ తండాకు చెందిన దంపతులు సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా మొక్కులు చెల్లించడానికి ఈ నెల 2వ తేదీన తమ స్వగ్రామం నుంచి అనంతపురం జిల్లా నేరడిగొండకు కాలినడకన వెళ్లారు. అక్కడ మొక్కులు చెల్లించిన తర్వాత కాలినడకన ఇంటికి తిరుగు ప్రయాణమైన ఆ దంపతులు శుక్రవారం రాత్రికి సంగారెడ్డి జిల్లా ఫసల్‌వాది గ్రామానికి చేరుకున్నారు. 
 
ఫసల్‌వాదిలోని జ్యోకిర్వాస్తు విద్యాపీఠంలో భోజనం చేసి పక్కనే ఉన్న ఓ చెట్టు కింద నిద్రపోయారు. అయితే, నిర్మాణంలో ఉన్న విద్యాపీఠం ఆలయంలో పెయింటింగ్ పనులు చేస్తున్న తమిళనాడుకు చెందిన మాధవన్ (34) సదరు వివాహితపై కన్నేశాడు. 
 
అర్థరాత్రి సమయంలో భర్త కళ్ల ముందే ఆమెపై అత్యాచారం చేశారు. అడ్డుకోబోయిన భర్తను రాయితో కొట్టి గాయపరిచాడు. నిందితుడు నుంచి తప్పించుకున్న భర్త 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న సంగారెడ్డి రూరల్ పోలీసులు నిందితుడు మాధవన్‌‍ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు నేరం అంగీకరించడంతో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments